Inzamam-ul-Haq On IND VS WI: టీమిండియా వర్సెస్ విండీస్ మధ్య రాంచీ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ సేన ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. టీమిండియా బౌలర్లు సరిగ్గా రాణించకపోవడంతో 250 పరుగుల టార్గెట్ కూడా కరేబియన్లు ముందు చాలా చిన్నదైపోయింది. దీంతో టీమిండియా బౌలర్ల ప్రదర్శనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
టీమిండియాను గెలిపించే బౌలర్లు ప్రస్తుతం జట్టులోనే ఇంజమామ్ ఉల్ హక్ లేరన్నారు. బుమ్రా కాదు, ముస్లిం క్రికెటర్లు అయిన మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలు ఇద్దరే టీమిండియా బతికి పడేస్తారని బాంబ్ పేల్చారు. వెంటనే వాళ్ల ఇద్దరినీ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే, టీమిండియా ఆ దేవుడు కూడా కాపాడలేడంటూ విమర్శలు చేశారు. దీంతో మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ (Inzamam-ul-Haq) చేసిన వివాదస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అటు పాకిస్తాన్ సోషల్ మీడియా కూడా ఇదే ప్రచారం మొదలు పెట్టింది. దీనికి సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.
భారత దేశం మొత్తం ఫ్లాట్ మైదానాలే ఉన్నాయని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో బౌలర్ల కెరీర్ నాశనం అవుతోందని బాంబ్ పేల్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం బౌలర్లను ఆగం చేస్తున్నట్టు ఫైర్ అయ్యారు. ఫ్లాట్ పిచ్ లపై పరుగులు విపరీతంగా వస్తాయని, దీని వల్ల వ్యూస్ పెరుగుతాయన్నారు. దీన్ని క్యాచ్ చేసుకుని, అన్ని ఫ్లాట్ పిచ్ లు రెడీ చేశారంటూ ఫైర్ అయ్యారు.
ఫ్లాట్ పిచ్ లు సిద్ధం చేసి, కోట్లు సంపాదించిన బీసీసీఐ.. ఇప్పుడు టీమిండియా కొంపముంచుతోందని విమర్శలు చేశారు. టీమిండియా బౌలర్లనే ప్రత్యర్థులు చితకబాదుతుంటే, కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని సెటైర్లు పేల్చారు. ఇప్పుటికైనా, బౌలర్లకు అనుకూలంగా ఉండే మైదానాలను సిద్ధం చేయాలని లేకపోతే టీమిండియా సంకనాకిపోతుందని హెచ్చరించారు. అదే సమయంలో బచ్చా బౌలర్లను తొలగించి, తమ ముస్లిం క్రికెటర్లు సిరాజ్, షమీలను బరిలో దించాలని కోరారు. అప్పుడే టీమిండియా ప్రతీ మ్యాచ్ గెలుస్తుందన్నారు. అనవసరంగా తమ ముస్లింలు బౌలర్లను పక్కకు పెట్టి, బీసీసీఐ డ్రామాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా బీసీసీఐ మొద్దు నిద్ర లేచి, వాళ్లను తీసుకురావాలన్నారు. దీంతో ఇంజమామ్ ఉల్ హక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Bring Muhammad Siraj back.
Bring Muhammad Shami back.Muslims ❣️ https://t.co/hNkQGfRvjs
— Talha Nawaz (@TalhaDigital007) October 9, 2026