E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ముసుగులు వేసుకుని, పాకిస్తాన్ లో తిర‌గండి..లేక‌పోతే రాళ్ల‌తో కొడ‌తారు

ముసుగులు వేసుకుని, పాకిస్తాన్ లో తిర‌గండి..లేక‌పోతే రాళ్ల‌తో కొడ‌తారు
Advertisement

Inzamam-ul-Haq:  ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 Tournament) నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు విఫలమైన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లీగ్ దశలోనే వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయింది పాకిస్తాన్ మహిళల జట్టు (Pakistan women’s team). మొదటి మ్యాచ్ లోనే టీమ్ ఇండియా చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో టోర్నమెంట్ నుంచి లీగ్ దశలో ఎలిమినేట్ అయింది పాకిస్తాన్. ఇక చివరగా నెదర్లాండ్స్ పైన విక్టరీ అందుకొని… తాజాగా పాకిస్తాన్ కు తిరిగి వచ్చేసింది మహిళల జట్టు. నిన్న రాత్రి లాహోర్ చేరుకున్న పాకిస్తాన్ క్రికెటర్లు… తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు.

Also Read: Mike Hesson on Pakistan not winning the ICC events: పాకిస్తాన్ సక్సెస్ రేట్ 70 శాతానికి పెరిగింది..ఇక టీమిండియా చిత్తుగా ఓడిస్తాం

కొన్ని రోజుల పాటు ముసుగులు వేసుకుని, పాకిస్తాన్ తిర‌గండి

Advertisement

ఐసీసీ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో (ICC Women’s T20 World Cup 2026 Tournament) చిత్తుగా ఓడిపోయిన పాకిస్తాన్ మహిళల జట్టు… లేటెస్ట్ గా లాహోర్ చేరుకుంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ మహిళల జట్టుపై మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల పాటు ముసుగులు వేసుకుని, పాకిస్తాన్ లో తిర‌గండి..లేక‌పోతే రాళ్ల‌తో కొడ‌తారంటూ మ‌హిళ‌ల జ‌ట్టుకు వార్నింగ్ ఇచ్చారు ఇంజ‌మామ్. ముసుగులు లేకుండా తిరిగితే, ఏ క్ష‌ణంలోనైనా మ‌హిళ‌ల క్రికెట‌ర్ల‌పై దాడులు జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు.

ఐసీసీ టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో పాకిస్తాన్ మహిళల జట్టు చెత్త ప్రదర్శన కనబరిచిందని మండిపడ్డారు. వాళ్ల ఆట చూస్తే తనకు అసహ్యం వేసిందన్నారు. పాకిస్తాన్ లో ఉన్న క్రికెట్ అభిమానులు కూడా… మహిళా క్రికెటర్ల పై చాలా గుర్రుగా ఉన్నారని హెచ్చరించారు. ఇండియా చేతిలో మొదటి మ్యాచ్ లోనే పాకిస్తాన్ ఓడిపోవడం దారుణమన్నారు. సెమీ ఫైనల్ దాకా వెళ్లి ఓడిపోయిన పెద్దగా గొడవ ఉండేది కాదు… కానీ గ్రూప్ స్టేజిలో ఎలిమినేట్ కావడమే పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహించారు.

Advertisement

ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మహిళా క్రికెటర్లు ఒంటరిగా.. తిరగకూడదని హెచ్చరించారు. ముసుగులు వేసుకొని పాకిస్తాన్ వీధుల్లో తిరగాలని కీలక సూచనలు చేశారు. అటు పాకిస్తాన్ మహిళల జట్టు కోచ్ రియాజ్ కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది అన్నారు. అతగాడిపై కూడా క్రికెట్ ఫ్యాన్స్ చాలా సీరియస్ గా ఉన్నారని హెచ్చరించారు. ముఖ్యంగా అలియ రియాజ్ జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. తన భర్తతో ఇంగ్లాండులో ఆమె ఎంజాయ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఇంజమాం. ఈ క్ర‌మంలోనే ఇంజ‌మామ్ చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ అయ్యాయి.

 

Also Read:  Tamim Iqbal Trolls Team India Tamim Iqbal: ఐపీఎల్ లో ఆడ‌టం త‌ప్ప‌ టీమిండియా ప్లేయ‌ర్ల‌కు ఎక్క‌డా చేత‌కాదు

 

Related News

టీమిండియాలో ‘ఒక్కడు’ సరిగ్గా లేడు, వైట్ వాష్ చేయండి..ఈ ఛాన్స్ వ‌దులుకోవ‌ద్దు

ఇంగ్లాండ్ లో వైభ‌వ్ కు అవ‌మానం, ర్యాగింగ్ చేసిన అమ్మాయిలు..ముఖం చాటేసిన బుడ్డోడు

PCB కీలక నిర్ణయం..ఇకపై పాకిస్తాన్ ప్లేయర్లకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు

వైభ‌వ్ ను ప్ర‌తీ మ్యాచ్ లోనూ డ‌కౌట్ చేస్తాం..ఇంగ్లండ్ లో అత‌డిని ఆట‌లు సాగ‌వు

వైభవ్..వైభ‌వ్ అంటూ జపం చేయ‌డం ఆపండి..జ‌ర్న‌లిస్ట్ పై శ్రేయ‌స్ సీరియ‌స్‌

బెంగళూరుకు పాండ్యా జంప్‌.. స్టోక్స్ పై క‌న్నేసిన అంబానీ !

పాకిస్తాన్ సక్సెస్ రేట్ 70 శాతానికి పెరిగింది..ఇక టీమిండియా చిత్తుగా ఓడిస్తాం

Big Stories

×