Devon Conway Father: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai uper Kings ) జట్టుకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టులో స్టార్ ప్లేయర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ట్ ఆటగాడు డెవన్ కాన్వే ( Devon Conway ) తండ్రి డెంటాన్ ( Denton) మరణించారు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ( Chennai Super Kings ownership ) అధికారిక ప్రకటన చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ క్లిష్ట సమయంలో స్టార్ ఆటగాడు డెవన్ కాన్వే కుటుంబానికి మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ పోస్ట్ పెట్టింది.
అలాగే డెవన్ కాన్వే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. అయితే ఈ విషయాన్ని… నిన్న ప్రకటించకుండా ఇవాళ వెల్లడించింది చెన్నై. నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ( Mumbai Indians vs Chennai Super Kings match ) జరిగిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ట్ ఆటగాడు డెవన్ కాన్వే తండ్రి మృతి నేపథ్యంలో ఆయనకు సంతాపంగా ముంబై మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ లందరూ నల్ల బ్యాడ్జి ( Black Badge) ధరించి ఆడారు. అటు.. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ట్ ఆటగాడు డెవన్ కాన్వే ఏప్రిల్ 11వ తేదీన చెన్నై ( CSK ) తరఫున చివరి మ్యాచ్ ఆడి.. న్యూజిలాండ్ ( New Zealand) వెళ్లిపోయాడు. తన తండ్రి ఆరోగ్యం విషమించడంతో మధ్యలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వదిలి న్యూజిలాండ్ కి వెళ్ళాడు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ట్ ఆటగాడు డెవన్ కాన్వే. అతడు న్యూజిలాండ్ చేరగానే ఆయన… తండ్రి మృతి చెందాడు.
కష్టాల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai super kings Team)…. అత్యంత దారుణంగా విఫలం అవుతూ వస్తోంది. పాయింట్లు ( Points Table ) పట్టికలో పదవ స్థానంలో నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్… కేవలం రెండు మ్యాచ్లో విజయం సాధించి ఆరు మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో పాయింట్లు పట్టికలో చివరి స్థానం లో నిలిచింది. ఈ దెబ్బకు ఈసారి ప్లే ఆఫ్ లోకి చెన్నై సూపర్ కింగ్స్ వెళ్లడం చాలా కష్టమని చెబుతున్నారు.