Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ గెలిచేలా కనిపిస్తోంది. బ్యాటింగ్లో అద్భుతంగా ఆడిన ముంబై ఇండియన్స్… బౌలింగ్లో కూడా దుమ్ము లేపుతోంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ ఆర్డర్ ను కుప్ప కూల్ చేసింది ముంబై ఇండియన్స్ బౌలింగ్ యాజమాన్యం. అయితే ఇలాంటి నేపథ్యంలో… రోహిత్ శర్మ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: IPL 2025 Playoffs: IPL మ్యాచులకు ఎక్స్‌ట్రా టైం పెంపు…ఇక రాత్రి 1:15 గంటల వరకు
క్యాచ్ వదిలేసిన రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ వదిలేసాడు. ముంబై బౌలర్ శాంట్నర్ వేసిన బౌలింగ్ లో ఢిల్లీ ఆటగాడు విప్రాజ్ నిగమ్ కు మంచి లైఫ్ వచ్చింది. విప్రాజ్ ఇచ్చిన క్యాచ్ ను ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల వదిలేశాడు. ఫ్రంట్ ఫీలింగ్ చేస్తున్న రోహిత్ శర్మ.. చేతిలో పడ్డ బంతిని వదిలేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ బౌలర్ శాంట్నర్.. చాలా సీరియస్ అయ్యాడు. రోహిత్ శర్మ కాబట్టి ఏమీ అనలేక వెనక్కి వెళ్ళిపోయాడు. అయితే ఇది గమనించిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే రోహిత్ శర్మను డగౌట్ లో కూర్చోమని చెప్పేశాడు హార్థిక్ పాండ్యా.
రోహిత్ శర్మను పంపించేసిన హార్థిక్ పాండ్యా
ఢిల్లీ ఆటగాడు విప్రాజ్ ఇచ్చిన క్యాచ్ ను వదిలేసిన రోహిత్ శర్మ పై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే… ఫీలింగ్ చేస్తున్న రోహిత్ శర్మను డ్రెస్సింగ్ రూమ్ కు పంపించేశాడు హార్థిక్ పాండ్యా. ఇక రోహిత్ శర్మ స్థానంలో మరో ఫీల్డర్ వచ్చి ఫీల్డింగ్ చేశాడు. అయితే దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన రోహిత్ శర్మ అభిమానులు చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు.
హార్దిక్ పాండ్యా పై రోహిత్ శర్మ ఫ్యాన్స్ సీరియస్
ఒరేయ్ హార్దిక్ పాండ్యా… నీది ఒక బతుకేనా…? మొన్న మొన్న కెప్టెన్ ఇప్పుడు రెచ్చిపోతున్నావా..? అంటూ రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ ఎన్నో విజయాలను టీమిండియా కు అందించాడు.. నువ్వు ఒక్కటైనా కప్పు తీసుకొచ్చావా ? అని మండిపడుతున్నారు. ఇకనైనా నీ బలుపు తగ్గించుకో అని ఫైర్ అవుతున్నారు.
రోహిత్ శర్మ పై ట్రోలింగ్
హార్దిక్ పాండ్యా చేసిన పనిపై కొంతమంది మెచ్చుకుంటున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బ్యాటింగ్, బౌలింగ్ అలాగే ఫీలింగ్ అస్సలు చేయరాదని సెటైర్లు పేల్చుతున్నారు. ఫీలింగ్ చేయడు కానీ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి బ్యాటింగ్ చేసి వెళ్ళిపోతాడు… అలాంటి ఆటగాడు అవసరం లేదంటూ చురకలు అంటిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) May 21, 2025
— Out Of Context Cricket (@GemsOfCricket) May 21, 2025