Sanju Samson : చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ( Chennai Super Kings fans ) అదిరిపోయే శుభవార్త అందబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మొన్నటి వరకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఉన్న… సంజు సాంసన్ ( Sanju Samson) షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఐపిఎల్ సీజన్ సమయానికి… రాజస్థాన్ రాయల్స్ జట్టు ను ( Rajasthan Royals) వదిలేసి… చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ( Csk Team) చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నాడట ఈ స్టార్ ఆటగాడు సంజు. ఈ మేరకు ఆయన చేసిన ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చెన్నైకి వచ్చేస్తున్న అంటూ పోస్ట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరిచిన జడ్చర్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఉంది. గడిచిన 18 సంవత్సరాల టోర్నమెంట్ లో… ఇంత దారుణంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోలేదు. మొట్టమొదటిసారిగా టోర్నమెంట్ నుంచి.. వైదొలిగిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెత్త రికార్డు నమోదు చేసుకుంది. అయితే అలాంటి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కాపాడేందుకు బాహుబలి వచ్చేస్తున్నాడని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ క్రికెటర్ సంజు… తాజాగా చేసిన పోస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని నింపింది.
తన భార్యతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ… ఇట్స్ టైం టు move అని సంజు తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. దీంతో.. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు సంబరపడిపోతున్నారు. రాజస్థాన్ రాయలసీ జట్టును వీడి చెన్నై సూపర్ కింగ్స్ లో చేరుతానని.. సంజు సామ్సన్ చెప్పకనే చెప్పాడని… చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. 2026 మెగా టోర్నమెంటులో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కూడా సంజు ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ సమయానికి మహేంద్రసింగ్ ధోని ఇంపాక్ట్ ప్లేయర్గా బర్లోకి దిగుతాడని.. అప్పుడు సంజు కెప్టెన్ అవుతాడని అంటున్నారు.
మినీ మెగా వేలంలోకి సంజూ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కంటే ముందు మినీ మెగా వేలం జరిగే ఛాన్సులు ఉన్నాయి. అయితే ఈ మినీ మెగా వేలం జరిగితే… కచ్చితంగా సంజు సామ్సన్ ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రవిచంద్రన్ అశ్విన్, విజయ శంకర్ లాంటి ప్లేయర్లను వదిలించుకొని… సంజు ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ ఇదే జరగాలంటే మొదటగా సంజూను… రాజస్థాన్ రాయల్స్ జట్టు వదులుకోవాలి.
Also Read: Sharayu Kulkarni- Pant: మీ దుంపలు తెగ…ఈ జంపింగ్స్ ఏంట్రా… పంత్ తరహాలో మరో లేడీ సెలెబ్రేషన్స్
🚨Sanju Samson is all set to leave Rajasthan Royals🚨
He is already in talks with 2 big franchises who needs an Indian Wicket keeper batter desperately. At RR, Shreyas-Pant kind of situation arised where Jaiswal want captaincy & RR has no other option but to agree to him. pic.twitter.com/ZQKtuOqja5
— Rajiv (@Rajiv1841) June 9, 2025