Ishan Kishan Sister: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం రోజున న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా ( India vs New Zealand, Final) మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో 96 పరుగులు తేడాతో టీమిండియా విజయం సాధించి, ముచ్చటగా మూడోసారి విశ్వ విజేతగా నిలిచింది. అయితే వరల్డ్ కప్ గెలిచిన సంబరాల్లో అందరూ ఉండగా, టీమిండియా డేంజర్ ఆటగాడు ఇషాన్ కిషన్ ( ISHAN KISHAN ) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇషాన్ కిషన్ సోదరి కారు ప్రమాదంలో ( car accident) మరణించారు. అయినప్పటికీ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఇశాన్ కిషన్ రావడం, అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.
టి20 వరల్డ్ కప్ ( T20 World Cup 2026 tournament ) విజేతగా టీమిండియా ( Team India) నిలిచిన నేపథ్యంలో భారత దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే ఇశాన్ కిషన్ ( Ishan Kishan Sister) ఇంట మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. టి20 వరల్డ్ కప్ ఫైనల్ కంటే ముందు కారు ప్రమాదం జరిగి, ఇషాన్ కిషన్ సోదరి మరణించారు. ఈ వార్త ఫైనల్ కంటే ముందు ఈశాన్ కిషన్ కు చేరింది. అయినప్పటికీ ఆ బాధను దిగ మింగుకొని, టీమిండియా కోసం బరిలోకి దిగాడు. ఇండియాకు టైటిల్ తీసుకువచ్చి, తన సోదరికి నివాళులు అర్పించాడు కిషన్. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడి ఎమోషనల్ అయ్యాడు. అయితే తన సోదరి మరణించిన విషయాన్ని మాత్రం, ఎవరికీ చెప్పకుండా ఇషాన్ కిషన్ మనసులోనే పెట్టుకొని కుమిలిపోయాడు. కానీ మీడియాకు ఈ విషయాన్ని హార్దిక్ పాండ్యా బహిర్గతం చేసి, అందరికీ షాక్ ఇచ్చాడు.
ఫైనల్స్ లో టీమిండియా గెలిచిన తర్వాత, తన సోదరి మరణించినట్లు ఇషాన్ కిషన్ ( Ishan Kishan) చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఫైనల్ కంటే ముందే తన సోదరిని పోగొట్టుకున్నానని.. ఆ బాధ దిగ మింగుకొని మ్యాచ్ ఆడినట్లు వెల్లడించారు. వ్యక్తిగత విషయాలకంటే.. ఇవాళ ఫైనల్ ( IND VS NX Final) చాలా ముఖ్యమని హార్దిక్ పాండ్యా తనకు చెప్పినట్లు గుర్తు చేశారు. ఇక అదే స్ఫూర్తితో ఇండియా కోసం ఆడానని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ( International Women’s Day ) సందర్భంగా టీమిండియా కు టైటిల్ రావడం గొప్ప విషయం అన్నారు. తన సోదరికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నానని స్పష్టం చేశారు.
ISHAN KISHAN HER COUSIN SISTER & DEDICATED VICTORY TO HER:
– “Before the game, I lost my cousin sister in car accident. I played well for her – I spoke to Hardik bhai, he said to put the team ahead. I dedicate this win to her & today is Women's Day, that’s more special for me”. pic.twitter.com/20KNJIYJ97
— Tanuj (@ImTanujSingh) March 9, 2026