BigTV English
Advertisement

International Award for Bumrah : బుమ్రాకి మరో ఇంటర్నేషనల్ అవార్డ్

International Award for Bumrah : బుమ్రాకి మరో ఇంటర్నేషనల్ అవార్డ్

ICC Player of the Month June 2024(Sports news today): టీ 20 ప్రపంచ కప్లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో టీమ్ ఇండియా ముందడుగు వేసింది. నిజానికి గ్రూప్ దశలో పాకిస్తాన్ తో జరిగిన లో స్కోరు మ్యాచ్ ని, బుమ్రా గెలిపించిన తీరు హైలెట్ అని చెప్పాలి. 119 పరుగులు చేసిన టీమ్ ఇండియాని ఒంటిచేత్తో గెలిపించాడు. 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 3 కీలకమైన వికెట్లు తీసి, మ్యాచ్ ని ఇండియావైపు తిప్పాడు. అప్పటికి అద్భుతంగా ఆడుతున్న మహ్మద్ రిజ్వాన్ ని బౌల్డ్ చేసిన తీరు అందరికీ గుర్తుండి పోతుంది. ఇలా టీ 20 వరల్డ్ కప్ లో అద్భుతంగా ఆడి 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంటు అవార్డు కూడా అందుకున్నాడు.


అంతేకాదు భారత్ కఠిన పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారి బుమ్రా ఆదుకున్నాడని కొహ్లీ కూడా తెలిపాడు. ఇదిలా ఉంటే.. బుమ్రా మరో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యాడు. ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారానికి బుమ్రా సెలెక్ట్ అయ్యాడు.

Also Read : నా జీవితంలో ఒక క్యాచ్ పట్టా, అదే గ్రేట్ : సూర్య


జూన్ నెలకు.. ఐసీసీ ప్రకటించిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును బుమ్రా దక్కించుకున్నాడు. అతడితో పాటు భారత మహిళల జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన కూడా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారానికి ఎంపికైంది. అవార్డు రేసులో కెప్టెన్ రోహిత్ శర్మ, ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ రెహ్మానుల్లా గుర్బాజ్ పోటీ పడ్డారు. వారిని ఓడించి బుమ్రా పురస్కారాన్ని గెలుచుకున్నాడు . ఓవరాల్ గా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్న ఎనిమిదో భారత ఆటగాడిగా నిలిచాడు.

ఇంతకుముందు రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కొహ్లీ, శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. గిల్ అయితే రెండుసార్లు ఈ అవార్డును అందుకున్నాడు. మొత్తానికి టీ 20 ప్రపంచకప్ ని టీమ్ ఇండియా గెలవడంలో బుమ్రా పాత్ర మరోసారి మార్మోగింది.

Related News

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Pratika Rawal : ప్రతికా రావల్ ను అవమానించిన ఐసీసీ.. కానీ అమన్ జోత్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

Big Stories

×