Afghanistan Premier League: ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Afghanistan Premier League 2026) అతి త్వరలోనే ప్రారంభం కాబోతోంది. దాదాపు 8 సంవత్సరాల విరామం తర్వాత ఈ టోర్నమెంట్ ను మళ్ళీ ప్రారంభించబోతోంది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇలాంటి నేపథ్యంలో తెరపైకి ఓ షాకింగ్ న్యూస్ వచ్చింది. ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్న ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు ఎలాన్ మాస్క్ (Elon Musk), జెఫ్ జోసెఫ్ (Jeff Bezos) సిద్ధమైనట్టు జాతీయ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కోట్లలో డబ్బులు పెట్టి.. రెండు జట్లను ఈ ఇద్దరు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీళ్లకు డబ్బులు సరిపోలేవని…ఇప్పుడు క్రికెట్ లో పెట్టుబడులు పెడుతున్నారా ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ను ( Afghanistan Premier League 2026) కమర్షియల్ గా విజయవంతం చేయడానికి మే నెలలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమావేశం కూడా జరిగిందని సమాచారం అందుతోంది. ఆ సమయంలో ఎలాన్ మాస్క్ (Elon Musk), జెఫ్ జోసెఫ్ (Jeff Bezos) ప్రతినిధులు హాజరయ్యారని చెబుతున్నారు. ఆగస్టు మాసం వరకు కందహార్, బల్ఖ్, కాబూల్ లకు చెందిన మూడు జట్లు సేల్ అయ్యాయి. మిగిలిన రెండు జట్లు వేలంలోకి వచ్చాయి. ఈ రెండిటిని కొనుగోలు చేసేందుకు ఎలాన్ మాస్క్ (Elon Musk), జెఫ్ జోసెఫ్ (Jeff Bezos) సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీళ్ళిద్దరూ సిద్ధమైతే పక్తియా, సంగర్హర్ జట్లను కొనుగోలు చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ డిసెంబర్ 27వ తేదీన ప్రారంభం కానుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించబోతున్నారు. మొత్తం ఐదు జట్లు పాల్గొనబోతున్న ఈ మెగా టోర్నమెంట్ టీ20 ఫార్మాట్ లో జరగనుంది. ఆటగాళ్ల డ్రాఫ్ట్ ప్రక్రియ అక్టోబర్ 24వ తేదీన యూఏఈ వేదికగా నిర్వహిస్తారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ తరహా లోనే ఆఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్ ను తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే ఎలాన్ మాస్క్ (Elon Musk), జెఫ్ జోసెఫ్ (Jeff Bezos) బరిలోకి దిగినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఐపీఎల్ ను కాకపోయినా, పాకిస్తాన్ సూపర్ లీగ్ ను మించిపోయేలా ఏపీఎల్ ను తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట.