John Cena WWE Record: రెజ్లింగ్ సూపర్ స్టార్ జాన్ సెనా (John Cena) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూ డబ్ల్యూ ఈ (WWE ) స్టార్ జాన్ సెనా.. మంచి పేరు తెచ్చుకున్నాడు. మన ఇండియాలో జాన్ సెనాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇండియా నుంచి రెజ్లింగ్ లోకి గ్రేట్ ఖలీ ( Great Khali ) వెళ్లినప్పటికీ… జాన్ సెనా కు మాత్రమే ఎక్కువ అభిమానులు ఇండియా నుంచి ఉన్నారు. అయితే అలాంటి డబ్ల్యు డబ్ల్యు ఈ స్టార్ జాన్ సెనా… రెజ్లింగ్ లో ( Wrestling ) సరికొత్త చరిత్ర సృష్టించాడు.
Also Read: Krunal-Kohli: నీకు మెంటలా… ఎక్కడ చూస్తున్నావ్.. కోహ్లీ పరువు తీసిన కృనాల్ పాండ్యా
అత్యధిక సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ ( World Championship titles ) గెలుచుకున్న తొలి ప్లేయర్ గా రెజ్లింగ్ సూపర్ స్టార్ జాన్ సెనా… సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతకు ముందు ఈ ఘనత రిక్ ఫ్లయర్ పైన ( Ric Flair ) ఉండేది. కానీ అతని రికార్డును తాజాగా రెజ్లింగ్ సూపర్ స్టార్ జాన్ సెనా బ్రేక్ చేశాడు. రిక్ ఫ్లై ఇప్పటి వరకు 16 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ గెలుచుకున్నాడు. అయితే ఆ రికార్డును రెజ్లింగ్ సూపర్ స్టార్ జాన్ సెనా బ్రేక్ చేస్తూ.. మొత్తం 17 వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ గెలుచుకున్నాడు. ఇలా 17 టైటిల్స్ గెలుచుకున్న ప్లేయర్లలో రెజ్లింగ్ సూపర్ స్టార్ జాన్ సెనా ఒక్కడే మాత్రమే ఉన్నాడు.
తాజాగా రెసిల్ మేనియా 41 ప్రత్యేక ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో మరో రెజ్లర్ కోడి రోడ్స్ ను ( Cody Rhodes ) ఓడించిన రెజ్లింగ్ సూపర్ స్టార్ జాన్ సెనా టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రిక్ ఫ్లైట్ రికార్డు బద్దలు కొట్టాడు రెజ్లింగ్ సూపర్ స్టార్ జాన్ సెనా. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన రెజ్లింగ్ సూపర్ స్టార్ జాన్ సెనా … రెసిల్ మేనియా ( WrestleMania 41) పోటీలే తనకు చివరి వని ప్రకటన చేశాడు.
Also Read: Vaibhav Suryawanshi: తొలి బంతికే సిక్స్…గ్రౌండ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న 14 ఏళ్ళ వైభవ్
ఇది ఇలా ఉండగా…. రెసిల్ మేనియా 41 లో ( WWE Wrestle Mania ) టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా మెరిశారు. రెజ్లింగ్ అంటే ఎక్కువగా ఇష్టపడే దగ్గుబాటి రానా ( Daggubati Rana )… ఏడాదిలో కచ్చితంగా రెండు ఈవెంట్లకైనా హాజరవుతాడట. ఇందులో భాగంగానే డబ్ల్యు డబ్ల్యు ఈ రెసిల్ మేనియా 41వ ( WWE Wrestle Mania ) ఈవెంట్ లో టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా దర్శనమిచ్చాడు. ఈ ఈవెంట్ డే 2 మెరిసాడు దగ్గుబాటి రానా. రానాకు రెజ్లింగ్ అంటే చాలా ఇష్టం… అలాగే చాలామంది రెజ్లర్లను కూడా కలిశాడు. దీంతో డబ్ల్యూ డబ్ల్యూ ఈ రెసిల్ మేనియా 41 ఈవెంట్లో రానా ( Daggubati Rana ) పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.