BigTV English

Kieron Pollard: 8 బంతులు… 7 సిక్సర్లు.. పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్… వీడియో చూస్తే

Kieron Pollard: 8 బంతులు… 7 సిక్సర్లు.. పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్… వీడియో చూస్తే

Kieron Pollard: వెస్టిండీస్ డేంజర్ ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్  ( Kieron Pollard) విధ్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. 38 ఏళ్ల పోలార్డ్.. వరుస సిక్సర్లతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం ఎనిమిది బంతుల్లో ఏడు సిక్సర్లు కొట్టి… సరికొత్త చరిత్ర సృష్టించాడు ఈ డేంజర్ ఆల్ రౌండర్ పోలార్. కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( Caribbean Premier League 2025 )  టోర్నమెంట్ లో భాగంగా… ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న పోలార్డు ఈ విధ్వంసకర బ్యాటింగ్తో రెచ్చిపోయాడు. సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్ ( St Kitts and Nevis Patriots ) తో జరిగిన మ్యాచ్ లోనే ఈ సంఘటన జరిగింది. సోమవారం జరిగిన మ్యాచ్లో 8 బంతుల్లోనే 7 సిక్సర్లు కొట్టి.. ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Also Read: David Warner : మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో విలన్ గా ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్?

8 బంతుల్లో 7 సిక్సర్లు కొట్టిన కీరన్ పోలార్డ్  ( Kieron Pollard)


సిపిఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ట్రిన్ బాగో నైట్ రైడర్స్ డేంజర్ ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్  ( Kieron Pollard)… ఊచకోత బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ పాట్రియాట్స్ తో జరిగిన మ్యాచ్ లో… 8 బంతుల్లోనే ఏడు సిక్సర్లు కొట్టి చుక్కలు చూపించాడు. ప్రత్యర్థి జట్టుకు సంబంధించిన నవీయన్ అలాగే వకార్ బౌలింగ్లో వరుసగా 6,6,0,6,6,6,6,6, కొట్టి దుమ్ము లేపాడు. ఈ నేపథ్యంలోనే 21 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ కరేబియన్ ఆటగాడు పొలార్డ్. మొత్తంగా ఈ మ్యాచ్లో 29 బంతుల్లో 65 పరుగులు చేసి దుమ్ము లేపాడు. పోలార్డుతోపాటు… పురాన్ కూడా రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్ లో 52 పరుగులతో రఫ్పాడించాడు. ఈ ఇద్దరి దెబ్బకు ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టు 12 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

పొలార్డ్ దెబ్బకు చిత్తుగా ఓడిన ప్రత్యర్థి

కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( Caribbean Premier League 2025 )  టోర్నమెంట్ లో భాగంగా…  వెస్టిండీస్ డేంజర్ ఆల్ రౌండర్ పోలార్డు దెబ్బకు… ప్రత్యర్థి జట్టు దారుణంగా ఓడింది. ట్రిని బాగో నైట్ రైడర్స్ చేతిలో సెయింట్ కిడ్స్ జట్టు 12 పరుగుల తీటతో ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ట్రి న్ బాగో నైట్ రైడర్స్ జట్టు… నిర్ణీత 20వలలో ఆరు వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని.. చేదించే క్రమంలో సెయింట్ కిట్స్ దారుణంగా ఓడిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 167 పరుగులు మాత్రమే చేసింది సెయింట్ కిట్స్. ఈ నేపథ్యంలోనే 12 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ట్రిన్ బాగ్ నైట్ రైడర్స్ ( Trinbago Knight Riders ).

Also Read: IND Vs PAK : ఆసియా కప్ లో పాక్ vs ఇండియా మ్యాచ్ షెడ్యూల్ లో మార్పు.. కొత్త టైమింగ్ ఇదే!

Related News

Mitchell Starc Retirement: ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ… డేంజర్ బౌలర్ మిచెల్ స్టార్క్ రిటైర్మెంట్

Indian Cricketers : టీమిండియా ప్లేయర్ల భార్యలందరూ ముస్లింసే.. ఇదిగో ప్రూఫ్!

Rahul Dravid-RCB : బెంగుళూరు కోసం రంగంలోకి ద్రావిడ్… ఇక RCB ఫ్యాన్స్ కు పండగే ?

Rohith Sharma : బాలీవుడ్ హీరోయిన్ పై మోజు పడుతున్న రోహిత్ శర్మ?

Sanju Samson : 30 సిక్స్ లతో రెచ్చిపోయిన సంజూ…నో లుక్ షాట్ వైరల్

Big Stories

×