BigTV English
Advertisement

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

MS Dhoni : టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఎం.ఎస్ ధోనీ.. ఆ జట్టుతోనే భవిష్యత్ లో కొనసాగనున్నాడు. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో అతను క్లారిటీ ఇచ్చాడు. 2008 నుంచి ఐపీఎల్ లో చెన్నై టీమ్ తోనే ధోనీ ఆడుతున్నాడు. అతని సారథ్యంలోనే ఆ జట్టు 5 సార్లు టైటిల్ కూడా నెగ్గింది. అయితే గత కొద్ది సీజన్ల నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సరిగ్గా పర్పార్మ్ చేయడం లేదు. దీంతో ధోనీ కెప్టెన్సీ సామర్థ్యం పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. చివరి సీజన్ లో రుతురాజ్ గౌక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టకి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో ధోనీ కెరీర్ ముగిసిందా..? అనే అనుమానాలకు ధోనీనే తెర దించాడు.


Also Read :  Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

ధోనీ ఫ్యాడ్ లు చాలా భిన్నం


తాజాగా ధోనీ గురించి మరో వార్త వైరల్ అవుతోంది.  ఎం.ఎస్ ధోనీ ఫ్యాడ్ లు ఇతర ఆటగాళ్ల ఫ్యాడ్ ల కంటే భిన్నంగా కనిపించడానికి కారణం, అతను సాంప్రదాయ ప్యాడ్ ల కంటే మందంగా.. పెద్దగా ఉండే ప్యాడ్ లను ధరించడం.. దీంతో బంతుల నుంచి అదనపు రక్షణ లభిస్తుంది. ధోనీ పాత,  బాగా ఉపయోగించిన ప్యాడ్ లను ధరించడానికి ఇష్టపడతాడు. వాటిని ధరించడం వలన అతనికి సౌకర్యంగా ఉంటుందని నమ్ముతాడు. మందపాటి ప్యాడ్ లు బంతి బలంగా తగిలినప్పుడు కలిగే గాయాన్ని నివారిస్తాయి. ముఖ్యంగా వికెట్ కీపింగ్ చేసేటప్పుడు ఇది చాలా ముఖ్యం. ధోనీ చాలా కాలంగా ఈ రకమైన ప్యాడ్ లను ఉపయోగిస్తున్నాడు. అవి అతనికీ అలవాటయ్యాయి. బహుశా కొత్త ప్యాడ్ లను ఉపయోగించడం వల్ల అతను అసౌకర్యంగా భావిస్తాడు. దీంతో చాలా సౌకర్యవంతంగా ఉండటంతో సిక్సులు కొట్టడానికి చాలా సులభం అవుతుందని తెలుస్తోంది.

ఎప్పుడూ ఎల్లో జెర్సీలోనే

మరో వైపు ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో ధోనీని యాంకర్ ఈ విధంగా ప్రశ్నించింది. మళ్లీ పసుపు రంగు జెర్సీలోనే ఐపీఎల్ ఆడుతారా..? అని ప్రశ్నించగా.. తన నిర్ణయం తాను తీసుకునేందుకు చాలా సమయం ఉందని.. ఎప్పుడూ ఎల్లొో జెర్సీలోనే ఆడుతానన్నాడు. క్రికెట్ ఆడినా, ఆడకపోయినా తన జర్నీ ఎల్లో జెర్సీలోనే కొనసాగుతుందన్నాడు. నేను, సీఎస్కే ఒకే దగ్గర ఉన్నామన్నారు. చెన్నై జట్టుతో రిలేషన్ పెరిగిందని.. ఓ వ్యక్తిగా ఎదగడానికి ఆ అనుభవం ఎంతో సహకరించిందని.. క్రికెటర్ గా చాలా ఇంప్రూవ్ అయ్యాయని తెలిపారు. ఇది మంచిదే అని.. తనకు కూడా వ్యక్తిగతంగా మంచిదేనని ధోనీ పేర్కొన్నాడు. 2025 సీజన్ లో పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చివరి స్థానంలో నిలిచింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా దూరం కావడంతో ధోనీ నే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించాడు. చెన్నై ఓటమిని పక్కకు పెడితే.. ధోనీ ఆట చూసేందుకు అభిమానులు స్టేడియం వద్దకు క్యూ కట్టడం విశేషం.

?igsh=NW9ldnhuZGdodnE3

Related News

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×