Sumaya Reddy: టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఉన్న అతి తక్కువమంది తెలుగుమ్మాయిల్లో మరొకరు యాడ్ అవుతున్నారు. తనే సుమయా రెడ్డి. ‘డియర్ ఉమా’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించడంతో పాటు తనే ఈ మూవీని నిర్మించింది కూడా. ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే పలు విధాలుగా సుమయా రెడ్డి పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఒక వైసీపీ నేతతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. దానిపై తను క్లారిటీ కూడా ఇచ్చేసింది. కానీ సినిమా ప్రమోషన్స్‌కు వెళ్లిన ప్రతీసారి తనకు ఈ విషయంపైనే ఇన్‌డైరెక్ట్‌గా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీంతో సుమయా రెడ్డి మరోసారి దీనిపై స్పందించింది.
మళ్లీ అదే ప్రశ్న
తాజాగా ‘డియర్ ఉమా’ టీమ్ అంతా తమ మూవీని ప్రమోట్ చేయడం కోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అందులో కూడాసోషల్ మీడియాలో తనపై ట్రెండ్ అయిన వీడియో గురించి సుమయా రెడ్డికి ప్రశ్న ఎదురయ్యింది. ‘‘సోషల్ మీడియాలో మీపై ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. మీరు దానిపై క్లారిటీ కూడా ఇచ్చేశారు. కానీ ఈమధ్య కాలంలో మహిళలపై ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. తాజాగా వైఎస్ జగన్ భార్య భారతీపైన కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి’’ అంటూ తాజాగా వైఎస్ జగన్ భార్య భారతీపై ఒక వ్యక్తి అసభ్యకర పోస్టులు షేర్ చేయడం గురించి ప్రస్తావిస్తూ దానిపై సుమయా రెడ్డి స్పందన అడిగారు.
అబ్బాయిల వల్లే సమస్యలు
‘‘సుమయా, భారతీ, బ్రాహ్మిణి అనే కాదు.. స్కూల్ నుండి అమ్మాయిలపై రూమర్స్ రావడం అనేది కామన్‌గా జరుగూతూనే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మాకు సమస్యలు క్రియేట్ చేసేది కూడా అబ్బాయిలే. నా గురించి వైరల్ అవుతుంది అంటే నేనేం చెప్పాలో నాకే అర్థం కావడం లేదు. ఇప్పుడు డియర్ ఉమ గురించి మాత్రమే మాట్లాడదాం’’ అని చెప్పుకొచ్చింది సుమయా రెడ్డి. మొత్తానికి ఈ విషయంపై తను ఇవ్వాలనుకున్న క్లారిటీ ముందే ఇచ్చేసింది. తనకు, ఏ వైసీపీ నేతకు ఎలాంటి సంబంధం లేదని, ఒక అమ్మాయిగా ఇలాంటివి చూడడం చాలా బాధగా ఉందంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసి ఈ రూమర్స్ అన్నింటిపై క్లారిటీ ఇచ్చేసింది.
Also Read: పాకిస్థాన్ రేవ్ పార్టీలో కరీనా కపూర్.. షాక్‌లో ఫ్యాన్స్..
తెలుగులోకి ఎంట్రీ
‘డియర్ ఉమా’ (Dear Uma) విషయానికొస్తే.. ఈ సినిమాలో సుమయా రెడ్డి (Sumaya Reddy)కి జోడీగా కన్నడ నటుడు పృథ్వి అంబార్ (Pruthvi Ambaar) నటిస్తున్నాడు. ఇప్పటికే కన్నడలో ‘దియా’ అనే సినిమాతో యూత్‌కు బాగా దగ్గరయ్యాడు పృథ్వి. ఆ మూవీ కూడా తెలుగులో డబ్ అవ్వడంతో తనకు తెలుగు ప్రేక్షకుల్లో కూడా గుర్తింపు లభించింది. అలా తనకు తెలుగులో కూడా అవకాశాలు రావడం మొదలయ్యింది. ఇప్పటికే ‘దియా’ సినిమాతో పృథ్వి అంబార్‌తో కలిసి నటించిన దీక్షిత్ శెట్టి.. ‘దసరా’ లాంటి సినిమాలో నటించి హిట్ కొట్టాడు. ఇప్పుడు పృథ్వి కూడా టాలీవుడ్‌లోకి నేరుగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఏప్రిల్ 18న ‘డియర్ ఉమా’ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది.