Michael Clarke On Virat Kohli: 2027 వన్డే వరల్డ్ కప్ సరిగ్గా ఏడాది తర్వాత జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటినుంచి అన్ని జట్లు వన్డే వరల్డ్ కప్ కోసం ప్రిపేర్ అవుతున్నాయి. జట్ల సభ్యులను కూడా సిద్ధం చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో విరాట్ కోహ్లీ గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ పైన అంతగా అంచనాలు పెట్టుకోకూడదని.. 2027 వన్డే వరల్డ్ కప్ లో అతడు అట్టర్ ఫ్లాప్ అవుతాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. విరాట్ కోహ్లీ ఏజ్ బార్ అయిందని తెలిపారు. ఇలాంటి క్రమంలో అతని స్థానంలో మరో ఆటగాడిని మూడో స్థానంలో తయారు చేయాలని టీమిండియా కు సూచనలు చేశారు. అలా కాదని విరాట్ కోహ్లీ తోనే వరల్డ్ కప్ లోకి దిగితే.. అనుకున్న ఫలితాలు రాబోవు అని, టీమిండియా నష్టపోవడం గ్యారంటీ అని హెచ్చరించారు. దీంతో మైఖేల్ క్లార్క్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా వన్డే జట్టులో మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఆడతాడు అన్న సంగతి తెలిసిందే. ఆ స్థానంలో వచ్చి చాలాసార్లు టీమిండియాను గెలిపించాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లో కూడా, విరాట్ కోహ్లీని ఆడించి… టైటిల్ గెలవాలనే లక్ష్యంతో బీసీసీఐ ముందుకు అడుగులు వేస్తోంది. విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ ఇద్దరు ఉంటే టీమిండియా, అవలీలగా టైటిల్ గెలుస్తుందని అంచనాకు వచ్చింది.
అయితే ఈ అంచనాలపై తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో తొందరపడి… ఏజ్ మీద పడిన విరాట్ కోహ్లీని తీసుకోకూడదని కోరాడు. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ లాంటి ఆటగాడిని సిద్ధం చేయాలని బీసీసీఐకి సూచనలు చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ కు మరో 365 రోజుల సమయం ఉందని గుర్తు చేశారు. ఈ క్రమంలో ప్రతిసారి రుతురాజుకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి వన్డే వరల్డ్ కప్ కోసం అతనిని సిద్ధం చేయాలని కోరారు. విరాట్ కోహ్లీ కంటే.. రుతురాజ్… దక్షిణాఫ్రికా గడ్డపై అద్భుతంగా రాణిస్తాడని తెలిపారు.
విదేశీ గడ్డపై విరాట్ కోహ్లీ పెద్దగా రాణించడం తాను ఎప్పుడూ చూడలేదు అన్నారు. పాకిస్తాన్ చెట్టుపై మాత్రం విరాట్ కోహ్లీ అద్భుతంగా రానిస్తాడని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని విరాట్ కోహ్లీని పక్కకు పెడితే బెటర్ అన్నారు. అయితే రోహిత్ శర్మ మాత్రం కచ్చితంగా టీమిండియా జట్టులో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. అతడి ఓపెనింగ్ భాగస్వామ్యం టీమిండియా కు మంచి బూస్ట్ అన్నారు.