Mohammad Amir On India vs Japan Wide controversy: టీమ్ ఇండియా వర్సెస్ జపాన్ మధ్య నిన్న జరిగిన ఏకైక టెస్ట్ సందర్భంగా వైడ్ బాల్ వివాదం రాజుకుంది. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంపైర్ మెడపై కత్తి పెట్టి మరి బెదిరించారని.. అందుకే టీమిండియా గెలిచిందంటూ బాంబు పేల్చారు. వైడ్ బాలని అంపైర్ ప్రకటించిన నేపథ్యంలో అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు వీధి రౌడీలలాగా అంపైర్ పైకి దూసుకు వెళ్లారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే అతడు భయపడిపోయి, వైడ్ బాల్ ను కౌంట్ గా ట్రీట్ చేస్తూ సిగ్నల్ ఇచ్చాడని వెల్లడించారు మహమ్మద్ అమీర్. దీంతో మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా వర్సెస్ జపాన్ మధ్య జరిగిన టి20 సందర్భంగా చోటు చేసుకున్న వైడ్ బాల్ వివాదం పైన మాజీ ఐసీసీ అంపైర్ అనిల్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. బాల్ పడేటప్పుడు, జపాన్ ఆటగాడు రివర్స్ స్వీప్ ఆడినట్టు తెలిపారు. అలా రివర్స్ స్లీప్ ఆడితే, వైడ్ బాల్ నిబంధనలు పరిగణలోకి తీసుకోకూడదని వెల్లడించారు. తన లెక్క ప్రకారం అది కౌంట్ బాలే అని తెలిపారు. ఇందులో ఎలాంటి వివాదం లేదని తేల్చి చెప్పారు. అనవసరంగా పాకిస్తాన్ సోషల్ మీడియా లో విష ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు.
వైడ్ బాల్ వివాదంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ స్పందించారు. జపాన్ పై ఓడిపోతామని భయంతో.. టీమిండియా చాలా దిగజారి ప్రవర్తించింది అని సీరియస్ అయ్యారు. అందుకే, అంపైర్ తో గొడవ పెట్టుకుని వైడ్ బాల్ ను కూడా… కౌంట్ గానే ట్రీట్ చేసేలా అక్షర్ పటేల్ , శ్రేయస్ అయ్యర్ కుట్రలకు తెర లేపారని ఫైర్ అయ్యారు. వాస్తవం చెప్పాలంటే ఈ మ్యాచ్ లో టీమిండియా పై జపాన్ గెలిచినట్లు భావించవచ్చని వ్యాఖ్యానించారు. విదేశీ ట్రాక్లపై టీమిండియా కు ఏమాత్రం ఆడరాదని పరువు తీశారు. ఈ వైడ్ బాల్ వివాదంపై కచ్చితంగా తాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఐసీసీ బాస్ గా జై షా ఉన్నప్పటికీ… టీమిండియా అంత చూసి తీరుతానని వార్నింగ్ ఇచ్చారు. టీమిండియా పై పోరాటానికి ఇంతకైనా తాను తెగిస్తానని స్పష్టం చేశారు. ఇందులో భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తప్పు చేసిన వాళ్ళను నిలదీయడమే తన పని అన్నారు.