E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 30th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఐశ్వర్యకు వార్నింగ్ ఇచ్చిన ఇందు   

Brahmamudi Serial Today Episode July 30th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఐశ్వర్యకు వార్నింగ్ ఇచ్చిన ఇందు   
Advertisement

Brahmamudi serial today Episode: ఇందు కాఫీ తీసుకుని రూంలోకి వెళ్లగానే.. రాజు రూంలో కళ్లు మూసుకుని ఏవేవో కలల కంటూ నవ్వుతూ కూర్చుని ఉంటాడు. రాజును గమనించిన ఇందు ఆహా ఎంత సంతోషంగా కూర్చున్నావు బావ. అక్కడేమో నాన్నమ్మ తాతయ్య మనం సత్యనారాయణ వ్రతం చేయాలని అంటున్నారు. కానీ నువ్వు నా దారిలోకి ఎప్పుడు వస్తావో ఏమో అనుకుంటూ గోడ మీద బల్లిని చూసి ఇదిగో బల్లి బాబు.. ఊరికే గోడమీద ఉండే బదులు నన్ను మా బావను ఒకటి చేయడానికి ఏదైనా చేయోచ్చు కదా అంటుంది. అప్పుడే బల్లి పలుకుతుంది. ఏంటి నీ సౌండ్‌ అర్థం కావడం లేదు అని ఇందు బల్లితో మాట్లాడుతుంటే..

రాజు కళ్లు తెరచి చూసి ఏయ్‌ పైకి చూస్తూ ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే నీతోనే మాట్లాడుతున్నాను బావ అని ఇందు చెప్తుంది. ఇందు బావ అనడంతో రాజు ఇరిటేటింగ్‌గా నువ్వు అలా పిలుస్తుంటే.. నాకు వింతగా విచిత్రంగా అనిపిస్తుంది. ఆ పిలుపునే డైజెస్ట్‌ చేసుకోలేకపోతున్నాను.. అంటూ చెప్తుండగానే.. గోడ మీద బల్లి రాజు మీద పడుతుంది. బల్లి పడగానే.. రాజు ఎగిరి ఇందు మీద కూర్చుంటాడు. ఇందు నా మీద నీకు ఎంత ప్రేమ బావ నా చంక మీద కూర్చున్నావంటే నీకు నా మీద చాలా ప్రేమే ఉందని నాకు అర్థం అవుతుంది అంటుంది. అందుకు రాజు ఏమీ లేదని పగటి కలలు కనొద్దని చెప్తాడు.

Advertisement

ఐశ్వర్య బయటకు వెళ్తుంటే.. ఇందు వచ్చి ఆపేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. నేను ఎక్కడికి వెళితే నీకేంటి..? అంటూ ఐశ్వర్య ప్రశ్నిస్తుంది. ఇలాంటి డ్రెస్‌ వేసుకుని ఈ టైంలో ఎందుకు వెళ్తున్నావు అని ఇందు అడిగితే ఇప్పుడు నీకు సంజాయిషీ ఇవ్వాలా..? నా డ్రెస్‌ ఎలా ఉంటే నీకేంటి..? అయినా చూసే చూపులో తప్పుంది కానీ డ్రెస్‌లో ఏముంటుంది అంటూ ప్రశ్నించగానే.. రాజు చెప్పాలి చెప్పకపోతే బాగుండదు అంటూ వార్నింగ్‌ ఇస్తే.. రాత్రి తాగి వచ్చిన విషయం ఇందు అందరి ముందు చెబితే.. రేఖ షాక్‌ అవుతుంది. ఐశ్వర్య కోపంగా ఇందును తిడుతూ.. రేఖతో దీని పెత్తనం ఏంటి ఆంటీ అని అడగ్గానే.. రేఖ మౌనంగా ఉంటుంది. ఐశ్వర్య మాత్రం కోపంగా అందరినీ తిడుతుంటే.. రాజు అడ్డుపడతాడు.

దీంతో నువ్వెవరు అడగడానికి అయినా నువ్వేం చేస్తావు.. అంటుంది. శేషు కల్పించుకుని అదేంటమ్మా తను ఈ ఇంటి అల్లుడు..అని చెప్పగానే.. రాజు తాను ఏం చేస్తానో రేఖ పిన్నికి బాగా తెలుసు అంతే కదా పిన్ని అంటాడు. ఐశ్వర్య కోపంగా రాజును తిడుతుంటే.. రేఖ కోపంగా ఐశ్వర్యను నోరు మూసుకుని ఉండమని చెప్తుంది. అప్పుడే రాజు అర్థం అయిందా..? ఇక నుంచి ఇంట్లో అందరూ రేఖ పిన్నితో సహా నా భార్య చెప్పినట్టు వినాలి తను చూసుకునే నేను చెప్పినట్టు వినాలి అనగానే.. అసలు వినకపోతే ఏం చేస్తారు అంటూ ఐశ్వర్య గద్దిస్తుంటే.. ఇందు కారు కీస్‌ లాక్కుంటుంది. కారు ఎందుకు వాడుతున్నావో నాకు చెప్పాలి అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. అపర్ణ, సుభాష్‌ అంతా చూసి ఫ్రౌడ్‌గా ఫీలవుతూ వెళ్లిపోతారు. అందరూ వెళ్లిపోతారు.

Advertisement

ఐశ్వర్య కోపంగా రేఖను ప్రశ్నిస్తుంది. మీరు మా రేఖ ఆంటీనేనా..? అసలు మీరెందుకు మారిపోయారు. ఆ రాజుకు భయపడుతున్నారా..? ఇందుకు భయపడుతున్నారా..? చెప్పండి ఆంటీ అంటూ నిలదీస్తుంది. భూషణ్‌ కూడా చెప్పు రేఖ అసలేం జరుగుతుంది ఈ ఇంట్లో అని అడుగుతాడు. ఆంటీ మీరు ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు మీ చేతిలో ఉన్న కారు కీస్‌ కూడా లాక్కుని తన పర్మిషన్‌ తీసుకోవాలి అంటుంది బాగా గుర్తుపెట్టుకోండి అంటూ వెళ్లిపోతుంది. భ్రమరాంబ కూడా అది చెప్తుంది నిజమే రేఖ. నువ్వెందుకు ఇలా ఉంటున్నావు.. అని అడుగుతుంది. రేఖ మౌనంగా వెళ్లిపోతుంది.

బయటకు వెళ్తున్న ఐశ్వర్య వెనకాలే లక్కీ వెళ్తాడు. నేను బయటకు వెళ్తున్నాను.. నాకు భయంగా ఉంది కొంచెం తోడుగా వస్తావా..? అని అడగ్గానే.. ఐశ్వర్య ఇదే మంచి అవకాశం అనుకుంటూ.. తాను కూడా బయటకు వెళ్లాలి నన్ను డ్రాప్‌ చేస్తావా..? అని అడుగుతుంది. లక్కీ సంతోషంగా సరే డ్రాప్‌ చేస్తాను అంటూ ఐషును ఎక్కించుకుని వెళ్తాడు. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 10!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆమె ఎంట్రీ ఖాయం..

Ninnu Kori Chandra : సీరియల్ లవర్స్ కు షాక్.. చంద్ర అవుట్..

Big Stories

Advertisement
×