E-Paper
Advertisement

ఢిల్లీ, గుజ‌రాత్ మ్యాచ్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం…డేవిడ్ మిల్ల‌ర్‌ అమ్ముడుపోయాడంటూ కైఫ్ సంచ‌ల‌నం !

ఢిల్లీ, గుజ‌రాత్ మ్యాచ్ లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం…డేవిడ్ మిల్ల‌ర్‌ అమ్ముడుపోయాడంటూ కైఫ్ సంచ‌ల‌నం !
Advertisement

Mohammad Kaif On DC vs GT:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ప్రతి మ్యాచ్ లోను ఉత్కంఠ నెలకొంటుంది. చివరి వరకు కొనసాగుతున్న మ్యాచులు, ఎవరు ఊహించని రీతిలో ఫినిష్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Delhi Capitals vs Gujarat Titans) మధ్య మ్యాచ్ కూడా ఇలాగే జరిగింది. ఢిల్లీ గెలుస్తుంది అనుకుంటే చివరి బంతికి గుజరాత్ టైటాన్స్ గెలవడంతో మ్యాచ్ ఫిక్సింగ్ ( MAtch Fixing)ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీంతో క్రికెట్ అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు. డేవిడ్ మిల్లర్ ను ( David Miller) గుజరాత్ టైటాన్స్ కు అమ్ముడుపోయాడని ఫైర్ అవుతున్నారు.

Also Read: Tanveer Ahmed: వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు…వాడి ఏజ్ ఒక్క‌టే కాదు, బ్యాట్లు కూడా చెక్ చేయాల్సిందే

ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపై కైఫ్ సీరియస్

Advertisement

అరుణ్ జైట్లీ వేదికగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ పై మహమ్మద్ కైఫ్ ( Mohammad Kaif ) చాలా సీరియస్ అయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచే మ్యాచ్ ను డేవిడ్ మిల్లర్ చేజేతులా పోగొట్టాడని మండిపడ్డారు. అతని వాల‌కం చూస్తుంటే, కావాలనే ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించినట్లు తెలుస్తోందని షాకింగ్ ఆరోపణలు చేశారు మ‌హ్మ‌ద్ కైఫ్. చివరి రెండు బంతులకు రెండు పరుగులు చేయాల్సి ఉండగా, ఒక్క పరుగు కూడా డేవిడ్ మిల్లర్ చేయలేకపోయాడు. ఐదవ బంతికి సింగిల్ తీసుకుంటే మ్యాచ్ డ్రా అయ్యేదని మహమ్మద్ కైఫ్ వివరించారు.

ఆ సమయంలో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చేదని గుర్తు చేశారు. సూపర్ ఓవర్ ఆడాల్సి వస్తే కచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించేదని తెలిపారు. గుజరాత్ టైటాన్స్ లో హిట్టర్స్ లేరు.. ఢిల్లీ క్యాపిటల్స్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు ఉన్నారని వెల్లడించారు. ఈ లెక్కన చూసిన ఢిల్లీ క్యాపిటల్స్ సులభంగా సూపర్ ఓవర్ లో విజయం సాధించాలని చురకలు అంటించారు. కానీ ఈ మ్యాచ్ లో డేవిడ్ మిల్లర్ చేసిన తప్పిదం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయిందని ఫైర్ అయ్యారు. చివరి బంతికి సింగిల్ కూడా తీయలేని చేతకాని దద్దమ్మ అంటూ మండిపడ్డారు.

అసలు డేవిడ్ మిల్లర్ పై విమర్శలు ఎందుకు ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా అరుణ్ జెట్ ని వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ మధ్య నిన్న మ్యాచ్ జరిగింది. ఇందులో గుజరాత్ 210 పరుగులు సాధించగా, ఢిల్లీ 209 పరుగులు చేసి ఒకే ఒక్క పరుగుతో ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఛేజింగ్ చేసే క్ర‌మంలో చివరి రెండు బంతులకు రెండు పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, స్రైకింగ్ లో ఉన్న డేవిడ్ మిల్ల‌ర్ 5వ బంతికి సింగిల్ తీయ‌కుండా నిర్ల‌క్ష్యం చేశాడు. ఆ త‌ర్వాత చివ‌రి బంతికి ఒక్క ప‌రుగు తీయ‌లేదు. ఈ క్ర‌మంలోనే కుల్దీప్ యాద‌వ్ ర‌నౌట్ అయ్యాడు. దీంతో గుజ‌రాత్ చేతిలో ఒకే ఒక్క ప‌రుగు తేడాతో ఓట‌మి పాలైంది ఢిల్లీ క్యాపిటల్స్‌. దీంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి.

Also Read: Virender Sehwag: రాసిపెట్టుకోండి…బుమ్రా బౌలింగ్ లో వైభ‌వ్ 6 బంతుల్లో ఆరు సిక్స‌రు కొడ‌తాడు

 

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×