E-Paper
Advertisement

Ninnu kori Serial Today Episode September 24th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ తో కలిసి గణపతి పూజ చేసిన చంద్ర 

Ninnu kori Serial Today Episode September 24th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ తో కలిసి గణపతి పూజ చేసిన చంద్ర 
Advertisement

Ninnu kori serial today Episode: దాక్షాయణికి నిజం చెప్పకుండా తాను మోసం చేసినట్టేనని సామ్రాట్‌ చనిపోయాడని మీకు ఎలా చెప్పగలను చెప్పలేను నన్ను క్షమించండి అంటూ మనసులో బాధపడుతుంది చంద్ర. మదన్‌ పూలు తీసుకొచ్చి ఇంట్లో డెకరేట్‌ చేస్తూ.. ఇవే పూలు అమ్మాయి జడలో ఉంటే ఎలా ఉంటుంది అంటూ ఒక ఇమాజిన్‌లోకి వెళ్తాడు. అప్పుడే శ్రీజ కాళ్లకు పట్టీలు పెట్టుకుని ఘల్లు ఘల్లు మనే సౌండ్‌తో నడుచుకుంటూ వస్తుంది.

శ్రీజను చూసిన మదన్‌ ఈ పిల్లేంటి ఇలా ఉంది. నోటికి తాళం పడ్డట్టు మాటలు లోపలే వస్తున్నాయి. గుండెల్లో ఏదో గిటార్‌ మోగుతుంది. కొంపదీసి ఈ పిల్లకు ప్లాట్‌ అయిపోయి గుండెల్లో గూడు కట్టుకునే ప్రోగ్రాం ఏదైనా జరుగుతుందా ఏంటి..? అనుకుంటూ శ్రీజ దగ్గరకు రాగానే.. తుమ్ముతాడు. శ్రీజ కోపంగా ఎందుకు తుమ్మావు నేను మా బావ కోసం వెళ్తుంటే అపశకునంగా నువ్వు తుమ్ముతావా..? అంటూ తిట్టి వెళ్లిపోతూ కిందపడబోతుంటే. మదన్ పట్టుకుంటాడు. శ్రీజ కోపంగా నా పర్మిషన్‌ లేకుండా ఎందుకు నన్ను టచ్‌ చేశావు అంటుంది. పడబోతుంటే పట్టుకున్నాను అని మదన్‌ అంటే.. నేను పడిపోతున్నా..? మా బావే నన్ను టచ్‌ చేయాలి అంటూ తిట్టి వెళ్లిపోతుంది.

Advertisement

అందరూ గణపతి పూజ చేస్తుంటారు. దాక్షాయణి మంత్రాలు చదువుతూ.. సామ్రాట్‌తో పూజ చేయిస్తుంది. దూపం, దీపం, నైవేద్యం అంతా దాక్షాయణి దగ్గరుండి మరీ సామ్రాట్ తో చేయిస్తుంది. చంద్ర మాత్రం స్వామి నన్ను నా బావను ఒకటి చేసి మా మధ్య ఉన్న విఘ్నాలను దూరం చేసి మమ్మల్ని ఒకటి చేయ్‌ అని మనసులోనే ప్రార్థిస్తుంది. హారతి ఇస్తున్న సామ్రాట్‌ కళ్లు తిరిగి కిందపడబోతుంటే చంద్ర వెళ్లి పట్టుకుంటుంది. ఇద్దరూ కలిసి హారతి ఇస్తారు. ఆ విధంగా చంద్ర కోరికను దేవుడు తీర్చినట్టు అవుతుంది. అంతా చూస్తున్న మదన్‌ ఆహా వినాయక ఇలా ఈ జంటను దగ్గర చేర్చి హారతి తీసుకుంటున్నావా..? స్వామి అంటూ మనసులో అనుకుంటాడు. గిరిజ కోపంగా మన అల్లుడితో కలిసి ఆ పిల్ల హారతి ఇవ్వడం ఏంటండి అని కోప్పడుతుంది. పూజ అయిపోయాక సామ్రాట్‌ బయటకు వెళ్లిపోతాడు. గిరిజ, శ్రీజ దగ్గరకు వెళ్లి నువ్వు బావతో వెళ్లి ఏదైనా మాట్లాడు అని చెప్తుంది. శ్రీజ బావ అంటూ వెనకాలే వెళ్తుంది.

బయట నిలబడి గతం గుర్తు చేసుకుంటున్న సామ్రాట్‌ దగ్గరకు శ్రీజ వెళ్లి అసలు నువ్వు గణపతి పూజ చేస్తే ఇల్లు ఎలా ఉండేదో తెలుసా..? నువ్వు మిగతా పండగల కన్నా వినాయక చవితికి గ్రాండ్ గా సెలబ్రేట్‌ చేసేవాడివి అంటూ శ్రీజ గతం గురించి చెప్తుంది. అప్పుడే మదన్‌ పరుగెత్తుకుంటూ వచ్చి శ్రీజను ఆపేస్తాడు. ఆయనకు పెద్ద పెద్ద విషయాలు గుర్తు చేస్తే ఆయన బ్రెయిన్‌ ఏమైపోద్ది అంటూ సామ్రాట్‌ను తీసుకుని వెళ్లిపోతాడు మదన్‌.

Advertisement

పక్కకు వెళ్లాక సామ్రాట్‌ అవును మదన్‌ ఆ థెరప్పి ఏంటి  అని అడిగితే.. ఏం లేదండి శ్రీజ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని అలా చెప్పాను అనగానే.. సామ్రాట్‌ అనే పేరు కన్నా విరాట్‌ అనే పేరు వింటేనే నేను ఎక్కువ కనెక్ట్‌ అవుతున్నాను.. సామ్రాట్‌ అంటే ఎవరినో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. విరాట్‌ అంటే నన్నే పిలుస్తున్నట్టు అనిపిస్తుంది.. అయినా విరాట్ అనే పేరు మీరు ఎందుకు చెప్పారు నాకు హాస్పిటల్‌ లో అంటూ ప్రశ్నిస్తే.. చంద్ర, మదన్‌ ఏం చెప్పాలో అర్థం కాక నిలబడిపోతారు. సామ్రాట్‌ గట్టిగా అడిగితే చంద్ర గారికి బాగా కావాల్సిన వారు అంటాడు మదన్‌. ముగ్గురూ నవ్వుకుంటారు.

అప్పుడే గిరిజ, శ్రీజ ఇంట్లోంచి బయటకు వస్తారు. సామ్రాట్‌ నవ్వుతుంటే చాలా బాగున్నాడని శ్రీజ చెప్తే.. ఆ చంద్ర పక్కన నిలబడి నవ్వుతుంటే నాకు కంపరంగా ఉంది ముందు మీ అత్తతో మాట్లాడి మీ పెళ్లికి ఏర్పాటు చేయాలి అని గిరిజ తిడుతుంది. తర్వాత మెడిసిన్స్‌ కోసం బయటకు వెళ్లిన మదన్‌ రోడ్డు మీద సామ్రాట్‌ మీద అటాక్‌ చేసిన రౌడీని చూసి వెంబడిస్తాడు. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Intinti Ramayanam Today Episode: అవనికి నిజం తెలిసిపోతుందా? పల్లవికి దిమ్మతిరిగే షాక్.. ఆరాధ్య మిస్సింగ్…

Thursday Tv Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode September 24th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాకు షాక్ ఇచ్చిన అమర్   

షార్ట్ ఫిలిమ్ అంటూ రూ.5 లక్షలు.. చివరికి పోలీసులకు బిగ్ బాస్ బ్యూటీ !

గణేష్ నిమజ్జనం స్పెషల్ ఈవెంట్.. సందడి చేసిన సెలబ్రిటీస్!

Big Stories

Advertisement
×