E-Paper
Advertisement

తెలంగాణ జైళ్ల చరిత్రలోనే తొలిసారి.. 78 మంది ఖైదీలు ‘పది’ పాస్!

తెలంగాణ జైళ్ల చరిత్రలోనే తొలిసారి.. 78 మంది ఖైదీలు ‘పది’ పాస్!
Advertisement

Prisoners Education: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ జైళ్ల చరిత్రలో తొలిసారిగా ఎన్‌ఐఓఎస్‌ (NIOS) ద్వారా 78 మంది ఖైదీలు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఖైదీల్లో విద్యాభ్యాసాన్ని, పునరావాసాన్ని ప్రోత్సహించేందుకు జైళ్ల శాఖ చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది.

78 మందికి ప్రత్యేక రిమిషన్

Advertisement

చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి 56 మంది, నిజామాబాద్‌ జైలు నుంచి 15 మంది, హైదరాబాద్‌ ప్రత్యేక మహిళా కారాగారం నుంచి ఏడుగురు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్య మిశ్రా ఉత్తీర్ణులైన ఖైదీలకు ధ్రువపత్రాలను అందజేసి అభినందించారు. విద్యపై ఖైదీలు చూపిన పట్టుదలకు గుర్తింపుగా 78 మందికి ప్రత్యేక రిమిషన్‌ ప్రకటించారు.

ధ్రువపత్రాలు అందజేసిన డీజీ

Advertisement

శిక్ష అనుభవిస్తున్నప్పటికీ విద్యను కొనసాగించి విజయాన్ని సాధించడం అభినందనీయమని డీజీ పేర్కొన్నారు. ఉత్తీర్ణులైన ఖైదీలు తదుపరి 10 +2, డిగ్రీ, ఐటీఐ తదితర వృత్తి విద్యా కోర్సులు కొనసాగించేలా ప్రోత్సహిస్తామని డీజీ తెలిపారు. విద్య ద్వారా జీవితంలో సానుకూల మార్పు తీసుకువచ్చి, భవిష్యత్తులో స్వయం ఆధారితంగా ఎదగాలని సూచించారు. ఖైదీలలో పరివర్తన తీసుకురావడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని జైళ్ల శాఖ అధికారులు తెలిపారు.

Also Read: పార్టీల్లో SIR టెన్షన్.. GHMC ఎన్నికలపై ప్రభావం ఉంటుందా..!

Tags

Related News

కలలోకి ప్రియుడు రావడంతో యువతి బలవన్మరణం, శంషాబాద్‌లో విషాద ఘటన

మునుగోడు పంచాయతీ సెక్రటరీలకు ఎమ్మెల్యే మాస్ వార్నింగ్!

రాజీవ్ యువ వికాసం పథకం బిగ్ అప్డేట్.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ!

హైడ్రా ప్రజావాణికి వెల్లువలా ఫిర్యాదులు.. ఒక్కరోజే ఇన్ని ఫిర్యాదులా..?

గద్వాల మున్సిపాలిటీలో రూ. 11 లక్షల గోల్‌మాల్ కలకలం!

ఐటీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మరో 1000 మందికి ఉద్యోగాలు!

బహదూర్‌పల్లి బాధితులకు కేటీఆర్ భరోసా.. ప్రభుత్వంపై కీలక డిమాండ్స్!

స్థానిక ఎన్నికలే టార్గెట్.. కవిత తన మార్క్ స్కెచ్.. పార్టీ నేతలతో వరుస భేటీలు!

Big Stories

Advertisement
×