Nauman Niaz sarcasm about Wahab Riaz: టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (2026 Women’s T20 World Cup tournament) నేపథ్యంలో పాకిస్తాన్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంటులో మొదటి నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయిన పాకిస్తాన్ మహిళల, ఎలిమినేట్ అయింది. ఇక లీగ్ దశలో నెదర్లాండ్స్ జట్టుతో నిన్న తలపడి విజయం సాధించింది పాకిస్తాన్. ఈ క్రమంలో పోతూ పోతూ ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసుకొని… పరువు కాపాడుకుంది. అయితే చివరి మ్యాచ్ లో గెలిచిన నేపథ్యంలో పాకిస్తాన్ మహిళల జట్టు ( Pakistan Womens Team) కోచ్ వహాబ్ రియాజ్ ను ఉద్దేశించి మాజీ క్రికెటర్లు సెటైర్లు పేల్చుతున్నారు. చివరి మ్యాచ్ లో అయినా పాకిస్తాన్ జట్టును గెలిపించినందుకు, కోచ్ వహాబ్ రియాజ్ జీతాలు పెంచాల్సిందే అంటూ చురకలు అంటించారు నౌమన్ నియాజ్ (Nauman Niaz). ఇంగ్లాండ్ నుంచి పాకిస్తాన్ వచ్చిన వెంటనే వహాబ్ రియాజ్ కు సన్మానం చేయాలని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నౌమన్ నియాజ్. దీంతో నవమన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 Tournament ) నేపథ్యంలో పాకిస్తాన్ వరుసగా నాలుగింటిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే చివరి మ్యాచ్ లో మాత్రం నెదర్లాండ్స్ పై పాకిస్తాన్ విక్టరీ అందుకుంది. దీంతో పాకిస్తాన్ హెడ్ కోచ్ వహాబ్ రియాజ్ పై దారుణంగా ట్రోలింగ్ చేశారు నౌమన్ నియాజ్. చివరి మ్యాచ్ లో అయినా పాకిస్తాన్ మహిళల జట్టును గెలిపించినందుకు రియాజ్ జీతం అమాంతం పెంచాల్సిందేనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డును రిక్వెస్ట్ చేశారు. అంతేకాదు రియాజ్ కు ప్రమోషన్ కూడా ఇవ్వాల్సిందేనని సెటైర్లు పేల్చారు. దీంతో నౌమన్ నియాజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అటు నౌమన్ నియాజ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రషీద్ లతీఫ్ పగలబడి నవ్వారు. మీరన్నది నిజమే.. రియాజ్ జీతమే కాదు.. విమానాశ్రయానికి వస్తే, చెప్పుల దండ వేసినా తప్పులేదంటూ దారుణంగా ర్యాగింగ్ చేశారు.
టి20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంటులో నిన్న నెదర్లాండ్స్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య నిన్న మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఆర్ వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది పాకిస్తాన్. ఈ లక్ష్యాన్ని నెదర్లాండ్స్ చేదించడంలో విఫలమైంది. ఈ క్రమంలో 89 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయిన నెదర్లాండ్స్ ఓడిపోయింది.