Jana Sena: ఇప్పుడు తెలంగాణలోనూ సంస్థాగతంగా మరింత బలోపేతం కావడంపై దృష్టి సారించింది. గ్లాజు గుర్తు పార్టీని క్షేత్రస్థాయిలోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో “జనసేన జాయినింగ్స్ డ్రైవ్” (చేరికల కార్యక్రమం) నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి.ఈ జాయినింగ్స్ డ్రైవ్‌ను అత్యంత పారదర్శకంగా, క్రమశిక్షణతో కూడిన పద్ధతిలో నిర్వహించేందుకు జనసేన అధిష్ఠానం ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని రంగంలోకి దించింది.
పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేలా, ఎలాంటి వివాదాలు లేని క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులను పార్టీలోకి ఆహ్వానించడం ఈ కమిటీ ముఖ్య విధి. చేరబోయే నాయకుల నేపథ్యాన్ని పరిశీలించి, సమన్వయం చేసుకునే బాధ్యతను వీరికి అప్పగించారు.అయితే చేరికల కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహించాలని ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతి ఉమ్మడి జిల్లాకు కమిటీ సభ్యులు స్వయంగా వెళ్లి, స్థానిక పరిస్థితులను సమీక్షిస్తారు.స్థానిక నియోజకవర్గాల ఇన్-ఛార్జ్‌లతో సమన్వయం చేసుకుంటూ, ఇతర పార్టీల నుండి వచ్చే ముఖ్య నేతలను, సామాజిక వేత్తలను పార్టీలోకి ఆహ్వానిస్తారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో పార్టీ నెట్‌వర్క్ మరింత పటిష్టం కానున్నదని కమిటీ సభ్యుల్లో ఒకరు తెలిపారు.
Also read: BRS MLCs: రూటు మార్చిన బీఆర్‌ఎస్ పెద్దలు.. మండలి వద్దు అసెంబ్లీ ముద్దు అంటున్న నేతలు..!
జనసేన పార్టీ ఎప్పుడూ యువతకు,కొత్త ఆలోచనలకు పెద్దపీట వేస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ జాయినింగ్స్ డ్రైవ్‌లో కూడా యూత్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్ఠానం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నదని వివరిస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలని ఆశపడే యువతీ యువకులు, విద్యార్థి నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను భాగస్వామ్యం చేయనున్నారు.యువతకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా పార్టీకి సరికొత్త గ్లామర్, జోష్ తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు జన సేన రాష్ట్ర నాయకులు వివరిస్తున్నారు. ఇందుకోసం గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన నేతలను గుర్తించి, జాయినింగ్స్ చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. అంతేగాక బీఆర్ఎస్, కాంగ్రెస్ లోని అసంతృప్తి నేతలను కూడా జన సేనలోకి తీసుకోవాలని పార్టీ అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నది.
స్పీడప్ కానున్న పార్టీ యాక్టివిటీస్..
ఈ భారీ చేరికల డ్రైవ్ ద్వారా పార్టీ యాక్టివిటీస్‌ను మరింత స్పీడప్ చేయాలని భావిస్తున్నారు.కొత్తగా చేరిన వారితో పాటు పాత క్యాడర్‌ను కలుపుకొని గ్రామ, మండల, డివిజన్ స్థాయిల్లో సరికొత్త కమిటీలను వేయనున్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లోని నిర్లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేలా క్యాడర్‌ను యాక్టివ్ చేయనున్నారు. రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలోజరిగిన తప్పిదాలు, హామీల అమల్లోకి జప్యాన్ని నిరంతరం ప్రజా వేదికల ద్వారా జనసేన ప్రశ్నించనున్నది. జిల్లా హెడ్ క్వార్టర్లతో పాటు హైదరాబాద్ లోనూ భారీ నిరసనలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. జాయినింగ్స్ తర్వాత ఈ కార్యక్రామన్ని చేపట్టనున్నట్లు పార్టీ వర్గాల ప్రతినిధి ఒకరు తెలిపారు.
Also read: ట్రంప్, పుతిన్ వచ్చినా అంతే బాసూ.. నాని ట్వీట్లపై చిన్ని పంచ్!