Different Types Of Rains: వర్షాలు ఎన్ని రకాలు అనగానే చాలా మంది రెండు రకాలు అని చెప్పేస్తారు. ఒకటి సాధారణ వర్షం, రెండు వడగళ్ల వర్షం అంటారు. కానీ, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే? వర్షాలు చాలా రకాలు ఉంటాయి. వినడానికే వింతగా ఉంటాయి. ఈ స్టోరీలో మనం వింతైన వానల గురించి తెలుసుకుందాం..
⦿ ఎరుపు వర్షం (Blood Rain): దేశంలో కొన్ని ప్రాంతాల్లో బ్లడ్ రెయిన్ పడిన సందర్భాలు ఉన్నాయి. వాన చూడ్డానికి ఎరుపు లేదంటే గులాబీ వర్షంలో కురుస్తుంది. గాలిలో ఎడారి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఎరుపు రంగు ధూళి, సాధారణంగా ఐరన్ ఆక్సైడ్ తో కూడిన ఇసుక వర్షంతో కలిసి భూమిపై పడుతుంది. ఈ ధూళి వర్షానికి ఎరుపు లేదంటే గులాబీ రంగును అందిస్తుంది. కొన్ని సందర్భాల్లో, ట్రెంటెపోలియా లాంటి ఎరుపు రంగు ఆల్గేలు గాలిలో కలిసి వర్షంతో పడుతాయి. జూలై 25, 2001 నుంచి సెప్టెంబర్ 23, 2001 వరకు కేరళలోని కొట్టాయం, ఇడుక్కి జిల్లాలో కురిసింది. స్పెయిన్, శ్రీలంకలోనూ ఇలాంటి వర్షాలు కురిశాయి. ఎరుపు వర్షం సాధారణంగా ప్రమాదకరం కాదు, కానీ స్థానికులకు ఆశ్చర్యంతో పాటు భయానికి గురయ్యే అవకాశం ఉంది.
⦿ జంతువుల వర్షం (Animal Rain): చాలా అరుదుగా ఈ వర్షం కురుస్తుంది. ఈ వర్షం పడే సమయంలో వర్షంతో పాటు చేపలు, కప్పలు, ఇతర జీవులు ఆకాశం నుంచి పడుతాయి. దీనికి కారణం బలమైన సుడిగాలులు, టోర్నడోలు నీటిలో ఉన్న చిన్న జీవులను గాలిలోకి లాగి, దూరంగా వర్షంతో పాటు పడేస్తాయి. మెక్సికోలో 2017లో చేపల వర్షం కురిసింది. ఈ చేపలను పట్టుకునేందుకు అప్పట్లో జనాలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.
⦿ వర్షంలో రంగులు (Rainbow with Rain): వర్షం కురుస్తున్నప్పుడు సూర్యకాంతి పడితే, ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. కానీ, కొన్నిసార్లు అరుదైన దృశ్యాలు ఏర్పాడుతాయి. డబుల్ ఇంద్రధనుస్సు, చంద్రుని కాంతితో ఏర్పడే మూన్ బో కనిపిస్తాయి. ఇవి చాలా అందంగా కనిపిస్తాయి.
⦿ విద్యుత్ వర్షం (Ball Lightning): వర్షం సమయంలో, ముఖ్యంగా తుఫానులలో బాల్ లైట్నింగ్ అనే వింత దృశ్యం కనిపిస్తుంది. ఇది ఒక గుండ్రని, ప్రకాశవంతమైన విద్యుత్ బంతిలా దర్శనం ఇస్తుంది. ఇది గాలిలో తేలుతూ కొంత సమయం ఉండి అదృశ్యమవుతుంది. ఇది ఎలా ఏర్పడుతుంది? కారణాలు ఏంటి? అనే పూర్తి వివరాలను కనుగొనే పనిలో ఉన్నారు శాస్త్రవేత్తలు.
⦿ వర్షంలో మట్టివాసన (Petrichor): వర్షం పడినప్పుడు భూమి నుండి వచ్చే ఒక ప్రత్యేకమైన సుగంధం వాసనను ‘పెట్రికోర్’ అంటారు. ఇది మట్టిలోని యాక్టినోమైసెట్స్ బాక్టీరియా విడుదల చేసే రసాయనాల వల్ల వస్తుంది. ఈ సుగంధం కొందరికి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అందుకే మట్టి వాసనను చాలా మంది ఇష్టపడుతారు. సాధారణంగా ఈ వాసన వేసవి తర్వాత కురిసే తొలకరి జల్లుల్లో ఎక్కువగా వస్తుంది.
Read Also: ఈ అమ్మాయికి ఇదేం పిచ్చి? AIతో ఎంగేజ్మెంట్.. 5 నెలలుగా డేటింగ్, చివరికి అది కూడా?