PSL 2025: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ పునః ప్రారంభమైంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన నేపథ్యంలో… ఈ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ కూడా వాయిదా పడింది. అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కూడా నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ ను కూడా వాయిదా వేశారు. అయితే ఈ రెండు టోర్నమెంట్లు కూడా మే 17వ తేదీన అంటే శనివారం రోజున పున ప్రారంభమయ్యాయి. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ను శనివారం ప్రారంభించారు.
Also Read: Virat Kohli: చిన్న స్వామిలో తెల్ల పావురాలు…కోహ్లీ కోసం భారీ ప్లాన్.. గూస్ బంప్స్ రావాల్సిందే
పాకిస్తాన్ గడ్డపై ఆపరేషన్ సిందూర్
పాకిస్తాన్ గడ్డ పైన ఆపరేషన్ సింధూర్ పేరు కలకలం రేపింది. మే 17 అంటే శనివారం రోజున పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ పునః ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ఉన్న కరాచీ కింగ్స్ వర్సెస్ పెషవర్ మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభం కంటే ముందు… స్టేడియానికి వచ్చిన అభిమానులు, స్పెషల్ గెస్ట్ లు, రెండు జట్ల ప్లేయర్లు కూడా స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధంలో… తమ దేశం గెలిచిందని మొదటి నుంచి పాకిస్తాన్ చెప్పుకుంటుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్పై విజయం సాధించినట్లు.. రావాల్పిండి స్టేడియంలో బాంబులు కూడా పిలిచారు. అలాగే రెండు నిమిషాల పాటు సైనికుల కోసం.. మౌనం కూడా పాటించారు.
అయితే ఈ సందర్భంగా…. స్టేడియం లోని స్క్రీన్ పైన ఆపరేషన్ సిందూర్ పేరు కలకలం రేపింది. ఈ పేరు కలకలం రేపడంతో…. ఇండియా విజయాన్ని పాకిస్తాన్ బహిరంగంగానే ఒప్పుకుందని… కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరి కొంత మంది.. మర్చిపోయి ఆపరేషన్ సింధూరని… పాకిస్తాన్ వాళ్ళు రాసుకున్నారని సెటైర్లు పేల్చుతున్నారు. మొత్తానికి ఈ ఆపరేషన్ సింధూర్ పేరు మాత్రం పాకిస్తాన్ దేశంలో కలకలం రేపింది.
రావల్పిండి స్టేడియంలో షోయబ్ అక్తర్, అఫ్రిది రచ్చ
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ పునః ప్రారంభమైన నేపథ్యంలో… పాకిస్తాన్ ఆర్మీ ఉన్నతాధికారులు అలాగే ప్రధాని షరీఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ అందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, షాహిద్ ఆఫ్రిది కూడా.. ఈ మ్యాజిక్ చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా.. పాకిస్తాన్ ఆర్మీ అధికారులను కలిశారు ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు. ఇండియా పై తామే విజయం సాధించాలని ఇప్పటికే… రోడ్లపై ర్యాలీలు కూడా తీశాడు షాహిద్ అఫ్రిది. ఇక ఇప్పుడు స్టేడియానికి వచ్చి తమ మద్దతు తెలిపారు. వీళ్ళ వీడియో కూడా వైరల్ గా మారింది.
Also Read: Virat Kohli Fans : కోహ్లీ కి అరుదైన గౌరవం.. చిన్నస్వామి స్టేడియంలో అన్ని 18 జెర్సీలే
Kya Rawalpindi Cricket Stadium mein match jeet gaya
Pakistan jo Asim Munir itna khush ho raha hai?
Ya Turkey se Paise ki bh**k mili hai ? pic.twitter.com/RzisTNvZn4
— Sumit (@EpicBeanster) May 17, 2025
Pakistan acknowledged the success of India's Operation Sindoor in re-opening match of PSL
"Rawalpindi cricket stadium" pic.twitter.com/P512wONTCx
— Global__Perspectives (@Global__persp1) May 17, 2025