Asia Cup 2025 : ఆసియా కప్ 2025 లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ టీమ్ మధ్య మ్యాచ్ ఆలస్యంగా జరిగిన విషయం తెలిసిందే. పాక్ హై డ్రామా చేసి గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చి విజయం సాధించింది. సూపర్ 4 కి అర్హత సాధించింది. ఈనెల 21న సూపర్ 4లో ఇండియాతో తలపడనుంది పాకిస్తాన్ జట్టు. అయితే గ్రూపు ఏ లో భాగంగా బుధవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ 41 పరుగుల తేడాతో యునైటేడ్ అరబ్ ఎమిరేట్స్ ని ఓడించింది. తొలుత టాస్ గెలిచి యూఏఈ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. దీంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ 36 బంతుల్లో 50 హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు అంతా విఫలం చెందారు.
Also Read : PAK vs UAE : పాకిస్తాన్ కు షాక్ మీద షాక్.. UAE మ్యాచ్ రిఫరీగా ఆండీ
సయిమ్ అయూబ్ వరుసగా మూడో మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. దీంతో అంతర్జాతీయ టీ-20ల్లో ఈ చెత్త రికార్డును నెలకొల్పిన మూడో పాకిస్తాన్ ఆటగాడిగా నిలిచాడు. పాకిస్తాన్ బ్యాటర్లలో ఫర్హాన్ (5), కెప్టెన్ సల్మాల్ అలీ అఘా (20), హసన్ (3), ఖుష్ దిల్ (4), హారిస్ (18) పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. కానీ చివర్లో షాహిన్ అఫ్రిది 14 బంతుల్లో 29 నాటౌట్ గా నిలిచాడు. షాహిన్ అఫ్రిది దూకుడుగా ఆడటంతో పాక్ మెరుగైన స్కోర్ సాధించింది. యూఏఈ బౌలర్లలో జునేద్ సిద్ధిఖీ 4 వికెట్లు తీయగా.. సిమ్రన్ జిత్ సింగ్ కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ కి దిగిన యూఏఈ 17.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది.
Asia Cup 2025: పాకిస్తాన్ కు రూ. 285 కోట్ల నష్టం…ఐసీసీ దెబ్బ అదుర్స్ ?
ఇక యూఏఈ బ్యాటర్లలో రాహుల్ చోప్రా 35 టాప్ స్కోరర్ గా నిలిచాడు. ధ్రువ్ పరాషర్ 20, అలిషన్ షరాపు 12, మహ్మద్ వసీమ్ 14 పరుగులు చేశారు. 85/3 విజయం సాధిస్తుందనుకున్న సమయంలో వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది యూఏఈ జట్టు. వికెట్లు పడి ఉండకుంటే పాకిస్తాన్ ని ఓడించి రికార్డు సృష్టించేదే. కేవలం 20 పరుగుల తేడాతోనే 7 వికెట్లు కోల్పోవడం గమనార్హం. 17 ఓవర్లలో చివరి బ్యాటర్ రోహిద్ ఖాన్ అనవసర పరుగుకు ప్రయత్నించడంతో ఆ జట్టు ఓటమి పాలైంది. ఇక పాకిస్తాన్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 2, హారిస్ రవూప్ 2, అబ్రార్ అహ్మద్ 2, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా ఒక్కో వికెట్ తీశారు. గ్రూపు ఏలో ఇప్పటికే భారత్ సూపర్ 4 కి అర్హత సాధించింది. తాజా విజయంతో పాకిస్తాన్ జట్టు కూడా అర్హత సాధించడంతో ఈనెల 21న సూపర్ 4 టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మరోసారి జరుగనుంది. ఇక ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు, పీసీబీ ఎలాంటి వావాదాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.