E-Paper
Advertisement

క్రికెట్ మానేసి, కిరాణా కొట్టు పెట్టుకోమని అవమానించారు

క్రికెట్ మానేసి, కిరాణా కొట్టు పెట్టుకోమని అవమానించారు
Advertisement

Parthiv Patel On Team India Selection:  టీమిండియాలోకి రావడం, జట్టులో నిలదొక్కుకోవడంపై తాజాగా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ (Parthiv Patel ) కీలక వ్యాఖ్యలు చేశారు. 2011 సమయంలో టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఇచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేశారని, కానీ అప్పుడు కొంతమంది తనను తొక్కేసినట్టు షాకింగ్ నిజాలను పంచుకున్నారు.క్రికెట్ మానేసి, కిరాణా కొట్టు పెట్టుకోమని అవమానించారని ఓ మాజీ సెలక్టర్ ను ఉద్దేశించి పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

క్రికెట్ మానేసి, కిరాణా కొట్టు పెట్టుకోమని అవమానించారు

తనది గుజరాత్ అని చెప్పడంతో ఈ మాటలు తనతో అన్నాడని ఆగ్రహించారు. గుజరాతీలు వ్యాపారాలు బాగా చేస్తారు కదా, నువ్వు కూడా కిరాణా కొట్టు పెట్టుకో అంటూ పరువు తీశాడని ఎమోషనల్ అయ్యారు. దీంతో సదరు సెలక్టర్ పై పార్థివ్ పటేల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఒకప్పటికి టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ దిలిప్ వెంగ్ సర్కార్ గురించే పార్థివ్ పటేల్ చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

సెలెక్టర్ కు పార్థివ్ పటేల్ ఛాలెంజ్

కిరాణ కొట్టు పెట్టుకోమని అవమానించిన సదరు సెలక్టర్ కు వెంటనే తాను ఛాలెంజ్ విసిరినట్టు పార్థివ్ పటేల్ (Parthiv Patel ) చెప్పుకొచ్చారు. రాబోయే తదుపరి రెండు సిరీస్ లలో తాను ఆడతానని, కచ్చితంగా టీమిండియాలోకి పునరాగమనం చేస్తానని సవాల్ విసిరినట్టు గుర్తు చేశారు. తాను చెప్పినట్టుగానే టీమిండియాలో స్థానం దక్కించుకున్నట్టు వెల్లడించారు. దీంతో అదే సెలెక్టర్ తన ముందు తలదించుకున్నారని షాకింగ్ నిజాలు పంచుకున్నారు.

నేను చెన్నైలో పుట్టింటే బాగుండు : పార్థివ్ పటేల్

Advertisement

నేను చెన్నైలో పుట్టింటే బాగుండంటూ 2011 సమయంలోనే ఓ పోస్ట్ పెట్టానని పార్థివ్ పటేల్ మరో షాకింగ్ స్టేట్ మెంట్ చేశారు. ఇక ఆ పోస్ట్ చూసి, బీసీసీఐ సెలక్టర్లు తనకు కాల్స్ చేశారని, ఆ పోస్ట్ కు అర్థం ఏంటి అంటూ ప్రశ్నించినట్టు చెప్పుకొచ్చారు. అయితే, వాళ్లు అడిగిన దానికి ముఖం మీదే ఆన్సర్ ఇచ్చినట్టు కుండ బద్దలు కొట్టి చెప్పారు. 2011లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు.

వరుసగా చెన్నై టైటిల్స్ గెలుస్తూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో తమిళనాడు నుంచి వచ్చిన వాళ్లకు టీమిండియాలో అవకాశాలు వచ్చాయని ప్రచారంలో ఉంది. ఇదే విషయాన్ని కోట్ చేస్తూ పార్థివ్ పటేల్ పోస్ట్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే, ఒకప్పుడు టీమిండియాలో ఛాన్స్ చాలా కష్టాలు పడ్డ… పార్థివ్ పటేల్ త్వరలోనే అజిత్ అగర్కార్ స్థానం భర్తీ చేయనున్నాడని అంటున్నారు. టీమిండియా చీఫ్ సెలక్టర్ గా బాధ్యతలు తీసుకోబోతున్నాడట.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

Related News

టీమిండియా ఫిక్సింగ్ చేసి గెలుస్తోంది..ఈ పరికరాలే దానికి సాక్ష్యం!

ఒరేయ్ వైభవ్ జాగ్రత్త..నీకు వినోద్ కాంబ్లీకి పట్టిన గతే పడుతుంది

36 ఏళ్ల ముసలోడిని తీసుకొచ్చి, ఏం పీకుతారు..భువీ రీ-ఎంట్రీపై తన్వీర్ సంచలనం!

పౌరసత్వం ఇస్తే, ఇండియాకు షిఫ్ట్ అవుతా…చివరి శ్వాస వరకు SRHతోనే ఉంటా

రాసిపెట్టుకోండి…కోహ్లీ-రోహిత్ రిటైర్మెంట్ ఇస్తే, వ‌న్డే క్రికెట్ అంత‌రించిపోతుంది

టీమిండియా ముందు పాకిస్తాన్ ప‌సికూనే…ఆస్ట్రేలియాతోనే అస‌లు ఫైట్

అప‌ర కుబేరులు ఎలాన్ మ‌స్క్, బెజోస్ చేతుల్లోకి అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్

Big Stories

Advertisement
×