BigTV English

MI VS PBKS: విలన్ గా మారిన ‘అహ్మదాబాద్’.. వణికిపోతున్న ముంబై

MI VS PBKS: విలన్ గా మారిన ‘అహ్మదాబాద్’.. వణికిపోతున్న ముంబై

MI VS PBKS:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా.. ఇవాళ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ జరగనుంది. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో సత్తా చాటిన ముంబై ఇండియన్స్ నేరుగా.. క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ కు సిద్ధమైంది. అటు క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయి.. ఇప్పుడు కసి మీద ఉంది పంజాబ్ కింగ్స్.


Also Read: PBKS vs MI, Qualifier 2: ముంబై VS పంజాబ్ మ్యాచ్ కు వర్షం పడితే.. విజేత ఎవరు

క్వాలిఫైయర్ 2 మ్యాచ్ టైమింగ్స్, వేడుక


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా క్వాలిఫైయర్ 2 ఇవాళ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో…. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై మధ్య ఫైట్ జరగనుంది. ఈ కీలక మ్యాచ్… అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించబోతున్నారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో టాస్ ప్రక్రియ ఉంటుంది. ఏడున్నర గంటలకు ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ను జియో హాట్ స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ లో మనం చూడవచ్చు. జియో కస్టమర్లు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే.. ఉచితంగానే మ్యాచులు అన్నీ చూడవచ్చు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలోనే ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది. ఇవాల్టి మ్యాచ్ లో విజయం సాధించిన.. జట్టు నేరుగా ఫైనల్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. జూన్ మూడవ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది.

వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే ఎలా ?

క్వాలిఫైర్ టు లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో వర్షం లేదా ఇతర కారణాలవల్ల మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ వర్షం పడి ఆగిపోయిన లేదా ఇతర కారణాల వల్ల రద్దయిన… ఎలాంటి రిజర్వ్ డే లేదు. కాబట్టి.. పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. కాబట్టి పంజాబ్ నేరుగా ఫైనల్ కి వెళుతుంది. ఫైనల్స్ లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫైట్ ఉంటుంది.

Also Read: RCB Fan: RCB టైటిల్ గెలవకపోతే.. సూ**సైడ్ చేసుకుంటా.. లేడీ సంచలన వీడియో

ముంబైకి విలన్ గా మారిన అహ్మదాబాద్

అయితే… ఇవాళ అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్ ముంబైకి అస్సలు కలిసి వచ్చే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఇప్పటివరకు అహ్మదాబాద్ లో ఒక్క మ్యాచ్ కూడా ముంబై గెలవలేదు. 2015 నుంచి ముంబై జట్టు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2014లో రాజస్థాన్ రాయల్స్ పైన గెలిచిన తర్వాత.. వరుసగా ఐదు మ్యాచ్ల్లో కూడా ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. దీంతో పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×