Ind Vs Aus Perth Test: టీమిండియా ( Team India ) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia) మధ్య బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్ త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. నవంబర్ 22వ తేదీన ఈ టోర్నీ ప్రారంభం అవుతుంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా… ఆస్ట్రేలియాకు ( Australia) వెళ్ళింది టీం ఇండియా జట్టు. ఈ ఐదు టెస్టుల్లో కచ్చితంగా నాలుగు గెలిస్తేనే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు ( World Test Champions Trophy Final) అర్హత సాధిస్తుంది టీమిండియా. లేకపోతే పరువు అయిపోతుంది.
Also Read: Ganguly on Rohit Sharma: కొడుకు పుడితే..మ్యాచ్ ఆడవా ? – రోహిత్ పై గంగూలీ సీరియస్ !
Also Read: Rohit Sharma Baby: మరోసారి తండ్రైన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ
మొదటి టెస్ట్… ఆస్ట్రేలియాలోని పెర్త్ ( Perth) వేదికగా…ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ స్టేడియంలో… జరిగే మ్యాచ్ కోసం 85, 000 మంది జనాలు రాబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే టికెట్లు కూడా బుక్ చేసుకున్నారట. అయితే ఒక టెస్ట్ మ్యాచ్ కోసం…. ఇంతటి స్థాయిలో… ఫ్యాన్స్ రావడం ఇదే తొలిసారి అని రికార్డులు చెబుతున్నాయి. కానీ జాతీయ మీడియా లెక్కల ప్రకారం.. పెర్త్ స్టేడియం స్టాండింగ్ రూమ్‌తో సహా స్టేడియం మొత్తం సామర్థ్యం 61,266 అని అంటున్నారు.
Also Read: Tilak Varma: ‘పుష్ప 3’ లో టీమిండియా స్టార్ తిలక్ వర్మ ?
ఇది ఆస్ట్రేలియాలో ( Australia) మూడవ అతిపెద్ద స్టేడియం. అయితే.. 85, 000 వస్తున్న తరుణంలో.. సీట్ల కెపాసిటీ పెంచారని అంటున్నారు. ఇది ఇలా ఉండగా.. పెర్త్ టెస్ట్ కంటే ముందే.. టీమిండియా ఊహించని షాక్ తగిలింది. పెర్త్ టెస్ట్ కు శుభ్‌మాన్ గిల్ తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా దూరం కానున్నారట. శుభ్‌మాన్ గిల్ పెర్త్ టెస్టుకు దూరమవడంతో, KL రాహుల్ ఓపెనర్ గా రానున్నారని సమాచారం.
Also Read: IND vs SA 4th T20i: సౌతాఫ్రికా చిత్తు..135 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ !
కేఎల్ రాహుల్ తో పాటు సర్ఫరాజ్ ఖాన్ ఓపెనర్ గా వస్తారని అంటున్నారు. గాయం కారణంగా శుభ్‌మాన్ గిల్ పెర్త్ టెస్టుకు దూరం అవుతున్నారట. అటు కొడుకు పుట్టిన నేపథ్యంలో… రోహిత్ గైర్హాజరు కానున్నారట. ఇక రోహిత్ గైర్హాజరీలో పేస్ స్పియర్ హెడ్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)..టీమిండియా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇక అటు ముగ్గురు పేసర్లుతో బరిలోకి దిగనుందట టీమిండియా. బుమ్రా, సిరాజ్ మరియు ఆకాష్ దీప్‌లను 1వ టెస్టులో ఆడనున్నారట. బుమ్రా, సిరాజ్ మరియు ఆకాష్ దీప్ లు అయితే.. ఆస్ట్రేలియాను ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. ఇక మహమ్మద్ షమీ.. ఆస్ట్రేలియా వెళ్లడంపై ఇంకా ప్రకటన రాలేదు.