BigTV English
Advertisement

PBKS VS RR: బ్యాటింగ్ చేయనున్న రాజస్థాన్.. పంజాబ్ జోరును ఆపుతారా ?

PBKS VS RR:  బ్యాటింగ్ చేయనున్న రాజస్థాన్.. పంజాబ్ జోరును ఆపుతారా ?

PBKS VS RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా రసవత్తర మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో 17 మ్యాచులు పూర్తయ్యాయి. ఇవాళ 18వ మ్యాచ్ జరుగుతోంది. ఈ 18వ మ్యాచ్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య బిగ్ ఫైట్… మరికాసేపట్లోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ… కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ దెబ్బకు రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తోంది. అయితే ఇవాల్టి మ్యాచ్లో సంజు కెప్టెన్ గా కొనసాగబోతున్నాడు.


Also Read: Digvesh Singh Rathi: మరోసారి వివాదం… దిగ్వేశ్‌‌కు మళ్లీ ఫైన్.. ఈసారి ఏకంగా!

మ్యాచ్ టైమింగ్స్, వేదిక, ఉచితంగా ఎలా చూడాలి?


పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ చండీగఢ్ లోని మహారాజా యదవింద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది. 7 గంటల సమయంలో టాస్ పూర్తి అయింది. అయితే.. ఈ మ్యాచ్ ప్రసారాలను జియో హాట్స్టార్ లో ఉచితంగానే చూడవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన అన్ని మ్యాచ్లు కూడా… జియో హాట్ స్టార్ లో అందిస్తున్నారు. అలాగే ఈ మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్ లో కూడా వస్తున్నాయి.

వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… పంజాబ్ కింగ్స్ దుమ్ములేపుతోంది. ఆడిన రెండు మ్యాచ్ల్లో కూడా విజయం సాధించి బంపర్ హిట్ అందుకుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో…. పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. దింతో నిన్నటి వరకు పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానంలో ఉన్న.. పంజాబ్ కింగ్స్ ఇవాళ కూడా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇక అటు రాజస్థాన్ రాయల్స్ మాత్రం అత్యంత దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన… రాజస్థాన్ రాయల్స్.. ఒకే ఒక్క మ్యాచ్లో విజయం సాధించింది. మూడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు ఓడిపోయింది రాజస్థాన్ రాయల్స్. దీంతో ఇవాళ గెలిచి పాయింట్స్ టేబుల్ లో పైకి రావాలని.. వ్యూహాలు రచిస్తున్నారు రాజస్థాన్ ప్లేయర్లు.

Also Read:  LSG Vs MI: తిలక్ రిటైర్డ్ హర్ట్.. పాండ్యా పై ట్రోలింగ్.. అసలు ఈ వివాదం ఏంటి?

పంజాబ్ కింగ్స్ VS రాజస్థాన్ రాయల్స్ జట్ల వివరాలు

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (w), శ్రేయాస్ అయ్యర్ ( C ), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (C), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ (w), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, సందీప్ శర్మ

Related News

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Pratika Rawal : ప్రతికా రావల్ ను అవమానించిన ఐసీసీ.. కానీ అమన్ జోత్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

Big Stories

×