BigTV English

IPL : ప్లేఆఫ్స్ రేసులో రాజస్థాన్.. పంజాబ్ ఇంటికి..

IPL : ప్లేఆఫ్స్ రేసులో రాజస్థాన్.. పంజాబ్ ఇంటికి..

IPL : తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ సత్తా చాటింది. పంజాబ్ ను ఓడించి ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఈ పరాజయంతో పంజాబ్ ఇంటి ముఖం పట్టింది. తమ ఆఖరి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. సామ్ కర్రన్ (49), జితేశ్ శర్మ (44), షారుఖ్ ఖాన్ (41 నాటౌట్) మెరుపులు మెరుపించడంతో పంజాబ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో నవదీప్ సైని 3 వికెట్లు, బౌల్ట్, జంపా తలో వికెట్ తీశారు.


188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్స్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మరోసారి బట్లర్ (0) దారుణంగా విఫలమయ్యాడు. యశస్వి జైస్వాల్ (50), దేవ్ దత్ పడిక్కల్ (51) హాఫ్ సెంచరీలతో రాణించారు. హెట్ మైయర్ (46) , రియాన్ పరాగ్ (20) దాటిగా ఆడటంతో రాజస్థాన్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పంజాబ్ పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

పంజాబ్ బౌలర్లలో రబడా రెండు వికెట్లు పడగొట్టాడు. సామ్ కర్రన్, అర్ష్ దీప్ సింగ్, నాథన్ ఇల్లీస్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు. కీలక సమయంలో అద్భుతంగా ఆడిన పడిక్కల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.


Related News

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Big Stories

×