E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

వైభ‌వ్ బాగా ఆడ‌తాడ‌ని టీమిండియా ప్లేయ‌ర్లే అరంగేట్రం ఆపుతున్నారు

వైభ‌వ్ బాగా ఆడ‌తాడ‌ని టీమిండియా ప్లేయ‌ర్లే అరంగేట్రం ఆపుతున్నారు
Advertisement

Rashid Latif:  ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India) మధ్య మరికాసేపట్లో టి20 సిరీస్ (India tour of England, 2026) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన టీమిండియా, బలమైన ఇంగ్లాండుతో మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. ఫిబ్రవరిలోనే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ టైటిల్ గెలిచిన టీమిండియా, ఐర్లాండ్ చేతిలో ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉంది. అయినప్పటికీ ఇంగ్లాండు పై టైటిల్ గెలుస్తామన్న కసితో ఇవాళ బరిలోకి దిగుతున్నారు టీమిండియా ప్లేయర్లు. ఇలాంటి నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavashi ) అంతర్జాతీయ అరంగేట్రం పైన సందిగ్ధత నెలకొంది. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ (Rashid Latif) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా అలాగే వైభవ్ సూర్యవంశీ మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేశారు. వైభ‌వ్ బాగా ఆడ‌తాడ‌ని టీమిండియా ప్లేయ‌ర్లే అరంగేట్రం ఆపుతున్నారని ర‌షీద్ ల‌తిఫ్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. వైభ‌వ్ ను టీమిండియా ప్లేయ‌ర్లే వెన‌క్కి లాగుతున్నారని బాంబ్ పేల్చారు. అత‌డు లేక‌పోతే, ఇంగ్లండ్ పై ఒక్క మ్యాచ్ కూడా టీమిండియా గెల‌వ‌బోదంటూ హాట్ కామెంట్స్ చేశారు ర‌షీద్ ల‌తీఫ్‌. దీంతో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read:  Tamim Iqbal Trolls Team India Tamim Iqbal: ఐపీఎల్ లో ఆడ‌టం త‌ప్ప‌ టీమిండియా ప్లేయ‌ర్ల‌కు ఎక్క‌డా చేత‌కాదు

వైభ‌వ్ బాగా ఆడ‌తాడ‌ని టీమిండియా ప్లేయ‌ర్లే అరంగేట్రం ఆపుతున్నారు

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాల్టి నుంచి టి20 సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ టోర్నమెంట్లో కచ్చితంగా 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీని ఆడించాల్సిందేనని డిమాండ్ చేశాడు. టీమిండియా యాజమాన్యానికి కొంచమైనా తెలివి ఉంటే, వైభవ్ అరంగేట్రాన్ని అస్సలు ఆపదంటూ బాంబు పేల్చాడు. అనవసరంగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా అతడిని ఆపి తప్పు చేశారని మండిపడ్డారు. ఇంగ్లాండ్ సిరీస్ లో మాత్రం వైభవ్ ను బరిలోకి దింపాల్సిందేనని కరాకండిగా తేల్చి చెప్పారు. అలా కాదని ఒంటెద్దు పోకడలకు వెళితే, ఇంగ్లాండ్ చేతిలో కూడా వైట్ వాష్ తప్పదని హెచ్చరించారు.

టీమిండియాలో దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు.. మొన్ననే వరల్డ్ కప్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు కూడా ఉన్నారని గుర్తు చేశారు. వాళ్లు ఆడినప్పటికీ ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని హితువు పలికారు రషీద్ లతీఫ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ఎవరు ఆడానంత అద్భుతంగా వైభవ్ సూర్య వంశీ ఆడాడు.. అన్నయ్య కావాలంటే మరొకసారి ఐపీఎల్ మ్యాచ్లను తిలకించాలంటూ ఎద్దేవా చేశారు. విదేశీ ఆటగాలను సైతం వణికిచాడని.. అలాంటి వైభవ్ ఇంగ్లాండ్ సిరీస్ లో ఆడితేనే బాగుంటుందన్నారు. అయితే వైభవ్ సూర్య వంశీ అరంగేట్రం చేస్తే బాగా ఆడతాడని.. టీమిండియా ప్లేయర్లే కుట్రలకు తెర లేపుతున్నారని మండిపడ్డారు. తమకంటే ఎక్కువ వైభవ్ కు పేరు వస్తుందని, అతడి అరంగేట్రాన్ని ఆపుతున్నారని ఆరోపణలు చేశారు.

Advertisement

Also Read: Mike Hesson on Pakistan not winning the ICC events: పాకిస్తాన్ సక్సెస్ రేట్ 70 శాతానికి పెరిగింది..ఇక టీమిండియా చిత్తుగా ఓడిస్తాం

 

Related News

Daryll Cullinan: టీమిండియాలో ఆడ‌టం నీ వ‌ల్ల కాదు..వెళ్లి గ‌ల్లీ క్రికెట్ ఆడుకో

ముసుగులు వేసుకుని, పాకిస్తాన్ లో తిర‌గండి..లేక‌పోతే రాళ్ల‌తో కొడ‌తారు

టీమిండియాలో ‘ఒక్కడు’ సరిగ్గా లేడు, వైట్ వాష్ చేయండి..ఈ ఛాన్స్ వ‌దులుకోవ‌ద్దు

ఇంగ్లాండ్ లో వైభ‌వ్ కు అవ‌మానం, ర్యాగింగ్ చేసిన అమ్మాయిలు..ముఖం చాటేసిన బుడ్డోడు

PCB కీలక నిర్ణయం..ఇకపై పాకిస్తాన్ ప్లేయర్లకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు

వైభ‌వ్ ను ప్ర‌తీ మ్యాచ్ లోనూ డ‌కౌట్ చేస్తాం..ఇంగ్లండ్ లో అత‌డిని ఆట‌లు సాగ‌వు

వైభవ్..వైభ‌వ్ అంటూ జపం చేయ‌డం ఆపండి..జ‌ర్న‌లిస్ట్ పై శ్రేయ‌స్ సీరియ‌స్‌

Big Stories

×