E-Paper
Advertisement

ఐపీఎల్ డ‌బ్బుల‌కు క‌క్కుర్తి ప‌డి, కెరీర్ నాశ‌నం చేసుకోవ‌ద్దు..పుజారా హెచ్చ‌రిక‌

ఐపీఎల్ డ‌బ్బుల‌కు క‌క్కుర్తి ప‌డి, కెరీర్ నాశ‌నం చేసుకోవ‌ద్దు..పుజారా హెచ్చ‌రిక‌
Advertisement

Pujara Warns Manav Suthar: టీమిండియా వర్సెస్ శ్రీలంక (Team India vs. Sri Lanka) మధ్య టెస్ట్ సిరీస్ (India tour of Sri Lanka 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా, ఈ మ్యాచ్ లో 165 పరుగుల తేడాతో బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ లో మానవ్ సుతార్ (Manav Suthar) ఏకంగా పదవి వికెట్లు తీశాడు. దీంతో శ్రీలంకపై అవలీలగా టీమిండియా విజయం సాధించగలిగింది. అయితే ఈ మ్యాచ్ లో 10 వికెట్లు పడగొట్టిన మానవ్ సుతార్ బౌలింగ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మాజీ క్రికెటర్లు.

ఐపీఎల్ డ‌బ్బుల‌కు క‌క్కుర్తి ప‌డి, కెరీర్ నాశ‌నం చేసుకోవ‌ద్దు

టీమిండియా వ‌ర్సెస్ శ్రీలంక  (Team India vs. Sri Lanka) మ‌ధ్య జ‌రిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అద్భుతంగా రాణించిన మానవ్ సుతార్ పై ప్రశంసల వర్షం మాజీ క్రికెటర్లు కురిపిస్తున్న నేపథ్యంలో చతేశ్వర్ పుజారా ( Pujara) మాత్రం చాలా భిన్నంగా స్పందించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ద్వారా వచ్చే డబ్బులకు కక్కుర్తి పడి….బౌలింగ్ యాక్షన్, ఫిట్నెస్ లెవెల్స్ అస్సలు తగ్గించుకోకూడదని మానవ్ సుతార్ కు వార్నింగ్ ఇచ్చారు పుజారా. బుమ్రా తరహాలో ఐపిఎల్ పైన ఎక్కువగా దృష్టి పెట్టకుండా.. కేవలం టెస్టుల్లో రాణించే ప్రయత్నం చేయాలని సూచనలు చేశారు. రవీంద్ర జడేజా స్థానంలో మానవ్ సుతార్ బాగా సెట్ అవుతాడని గుర్తు చేశారు. త్వరలోనే రవీంద్ర జడేజా రిటర్మెంట్ ప్రకటిస్తాడని.. అతని స్థానాన్ని మానవ్ సుతార్ భర్తీ చేస్తాడని వెల్లడించారు.

Advertisement

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

బుమ్రా లాగా డబ్బులకు అస్సలు ఆశపడొద్దు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( Indian Premier League tournament ) ప్రారంభం కాగానే.. టెస్టులను వదిలేసి ఆ టోర్నమెంట్ ఆడితే మానవ్ సుతార్ కు తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుందని హెచ్చరించారు చతేశ్వర్ పుజారా ( Pujara). ఐపీఎల్ కంటే టెస్ట్ పై ఫోకస్ పెడితే, అతడి కెరీర్ ముందుకు సాగుతుందని వివరించారు. కేవలం ఐపిఎల్ పైన దృష్టి పెడితే… బుమ్రా తరహాలో గాయాల బారిన పడడం ఖాయమని హెచ్చరించారు.

Advertisement

అవసరం అనుకుంటే ఐపీఎల్ ఆడవచ్చు.. కానీ సహజమైన బలాన్ని ఐపీఎల్ ( IPL ) కోసం అస్సలు మార్చుకోకూడదని కీలక సూచనలు చేశారు పుజారా. రెడ్ బాల్ క్రికెటర్ లో బంతిని గాల్లో ఫ్లైట్ చేస్తూ కాస్త నెమ్మదిగా మానవ్ సుతార్‌ బౌలింగ్ చేస్తున్నాడని.. అలా వేయడం ఎవరి వల్ల కాదని ప్రశంసించారు. కేవలం ఐపీఎల్ లాంటి టి20 టోర్నమెంట్ ల కోసం వేగంగా బంతులు వేయడం వైపు వెళ్తూ తన ఒరిజినాలిటీని కోల్పోకూడదని హెచ్చరించారు చతేశ్వర్ పుజారా ( Pujara).

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

Related News

తొలి టెస్ట్ లో పాకిస్తాన్ అంపైర్…శత్రువైనా టీమిండియాను గెలిపించాడంటూ ఆరోప‌ణ‌లు!

షాహిద్ అఫ్రిదిని కుక్క అంటూ బండ బూతులు తిట్టాను…ఇర్ఫాన్ ప‌ఠాన్ సంచ‌ల‌నం

టీమిండియా క్రికెట‌ర్లు పీక‌ల‌దాకా తాగి, నాకు ఉపాధి లేకుండా చేశారు!

టీమిండియా విజ‌యం ఐసీసీ కుట్ర‌..స్పిన్ ట్రాక్ పెట్టి, లంక‌ను ఓడించారు!

మాన‌వ్ మ్యాజిక్, శ్రీలంక‌పై టీమిండియా విజ‌యం..అయినా WTCలో గిల్ సేన‌కు అన్యాయ‌మే !

IPLలోకి తీసుకుంటాం, తొంద‌ర‌గా ఔట్ అవ్వు..లంక బ్యాట‌ర్‌ను ట్రాప్ చేసి జైస్వాల్

పాకిస్తాన్ జ‌ట్టు మాకు ఈకతో సమానం…3-0 తేడాతో వైట్ వాష్ చేస్తాం

Big Stories

Advertisement
×