Ashish Nehra On Shoaib Akhtar Bowling Speed: పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ బౌలింగ్ పై టీమిండియా మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బౌలర్ షోయబ్ అక్తర్ కాదని… అతని కంటే వేగంగా వేసే బౌలర్లు కూడా ఉంటారని బాంబు పేల్చారు. పదే పదే గంటకు 150 కిలో మీటర్ల వేగంతో తాను బంతులు వేస్తానని… షోయబ్ అక్తర్ డబ్బా కొట్టుకుంటాడని మండిపడ్డారు. కానీ ఒక్క మ్యాచ్ లో 30 బంతుల కంటే ఎక్కువగా 150 స్పీడ్ తో అతడు బంతులు వేయడం కష్టమేనని పరువు తీశారు ఆశిష్ నెహ్రా. ఏదో ఒక్క బంతి మాత్రమే 155 స్పీడ్ పడుతుందని హేళన చేశారు. ఆ మాత్రం దానికే తాను తోపు, తురుము అంటూ షోయబ్ అక్తర్ బిల్డప్ ఇస్తాడని సెటైర్లు పేల్చారు. అతనికి సమానంగా టీమిండియాలో కూడా బంతులు వేసే ఆటగాళ్లు ఉన్నారని వివరించారు. అయితే, పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన ఫాస్ట్ బౌలర్లు డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపణలు చేశారు.
షోయబ్ అక్తర్ పై ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడు 30 కంటే ఎక్కువగా 150 స్పీడ్ తో బంతులు వేయలేదని హేళన చేశారు. ఒక మనిషికి 10 ఓవర్లు వేసే కెపాసిటీ తక్కువే అన్నారు. 5 ఓవర్ల వరకు షోయబ్ అక్తర్ కూడా స్పీడ్ ను మెయింటైన్ చేస్తాడన్నారు. కపిల్ దేవ్, జహీర్ ఖాన్ అలాగే శ్రీనాథ్ అప్పట్లో 145 స్పీడ్ మెయింటేన్ చేస్తూ బంతులు సంధించేవారని వివరించారు. ఇందులో జహీర్ ఖాన్ కచ్చితంగా ప్రతి బంతి 145 స్పీడ్ తో వేసేవాడని గుర్తు చేశారు. షోయబ్ అక్తర్ కంటే జహీర్ ఖాన్ అత్యంత ప్రమాదకరమైన వాడు అంటూ ప్రశంసించారు నెహ్రా.
టీమిండియాలో విపరీతంగా బ్యాటర్లు ఉన్నారని గుర్తు చేసిన ఆశిష్ నెహ్రా…. పాకిస్తాన్ లో బౌలర్లు ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు గుర్తు చేశారు. బీసీసీఐ ఎక్కువగా బ్యాటర్లను తయారు చేసేందుకు మొగ్గు చూపుతోందని… బౌలర్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం లేదని మండిపడ్డారు. కానీ పాకిస్తాన్ మాత్రం చాలామంది ఫాస్ట్ బౌలర్లను తయారు చేసిందని గుర్తు చేశారు. షోయబ్ అక్తర్ ఒక్కడే కాదు వసీమ అక్రమ్, ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ ఆసిఫ్, వకార్ యూనిస్ లాంటి వాళ్ళను ఎంతో మందిని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తయారు చేసిందని వెల్లడించారు. షోయబ్ అక్తర్ తరహాలో మయాంక్ యాదవ్, జమ్ము కాశ్మీర్ స్పీడ్ స్టార్ ఉస్మాన్ మాలిక్, అకీబ్ నబీ లాంటి వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తారని వివరించారు. కానీ వీళ్లను బిసిసిఐ పట్టించుకోని ఎంకరేజ్ చేయాలని కోరారు. అప్పుడే టీమిండియా కు తోపు బౌలర్లు దొరుకుతారని వివరించారు.