RCB Playoffs| ఐపిఎల్ 2025లో భాగంగా శనివారం మే 18న బెంగళూరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జరగాల్సిన మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దు అయింది. దీని వల్ల రెండు టీమ్‌లకు చెరో పాయింట్ లభించింది. ఫలతంగా గత సంవత్సరం ఐపిఎల్ టైటిల్ గెలిచిన కోల్‌కతా ఈ మ్యాచ్ రద్దు కావడంతో 13 మ్యాచ్ లతో కేవలం 12 పాయింట్లతో ఇక ప్లేఆఫ్స్ ఛాన్సులు కోల్పోయింది. మరోవైపు ఆర్సీబీ మాత్రం 17 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. అయితే 17 పాయింట్లు ఆర్సీబీకి కచ్చితంగా ఐపిఎల్ ప్లేఆఫ్స్ కు చేరుస్తాయని నమ్మకం లేదు.
శనివారం జరగాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీ అభిమానులు ఎంతో ఉత్సాహంగా వచ్చారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి టెస్ట్ కెరీర్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన అభిమానులు తెల్లటి జెర్సీలతో ధరించి వచ్చారు. కానీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో కోహ్లి హార్డ్ కోర్ అభిమానులు నిరుత్సాహం చెందారు. దీనికి తోడు ఆర్సీబి ప్లేఆఫ్స్ వెళ్లాలంటే దానికి పోటీగా ఇతర ఆరు టీమ్ లున్నాయి. అయితే ఈ ఆరింటిలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆర్సీబీ ప్లేఆఫ్ చాన్సులకు ప్రమాదం పొంచి ఉంది.
ప్లేఆఫ్స్ కు ఆర్సీబీ క్వాలిఫై కావాలంటే పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ రెండింటిలో ఒక టీమ్ మిగతా మ్యాచ్ లలో ఓటమి చెందాలి. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మిగతా టీమ్ ల ఆటతీరుపై ఆర్సిబీ ప్లేఆఫ్స్ చాన్సులు ఆధారపడ్డాయి.
ఉదాహరణకు ఆర్సీబీకి ఇక మిగిలిన రెండు మ్యాచ్‌లు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్‌తో ఉన్నాయి. ఈ రెండింటిలోనూ ఆర్సీబీ ఓడిపోతే
మరోవైపు పంజాబ్ కింగ్స్.. రాజస్థాన్ రాయల్స్ తో జరిగాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించి ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తో జరగాల్సిన మ్యాచ్‌లలో ఓడిపోతే
ఢిల్లీ క్యాపిటల్స్ మిగిలిన మూడు మ్యాచ్ లలో కనీసం రెండింటిలో విజయం సాధించినా.
ఈ మూడు ఐపిఎల్ టీమ్స్ కు 17 పాయింట్లు ఉంటాయి. అప్పుడు ఈ మూడు జట్ల మధ్య టై అయిపోతుంది.
Also Read: బుమ్రా లేదా శుభమన్ గిల్ ఎవరు టెస్ట్ కెప్టెన్?.. తేలిపోయిందిగా..
ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ఈ రెండు టీమ్ లు అన్నింటి కంటే పై రెండు స్థానాల్లో కొనసాగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో 17 పాయింట్లు ఉన్నా.. ఆర్సీబీకి నెట్ రన్ రేట్ పై ఆధారపడాల్సి వస్తుంది. ఇలా జరగాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్ రెండు జట్లు పెద్ద మార్జిన్లతో గెలవాలి.
అందుకే ఆర్సీబీ ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోవాలంటే పంజాబ్ కింగ్స్ లేదా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ కు అర్హతకు కోల్పోవాలి. ఈ నిర్ణయం ఆదివారం తేలనుంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓడిపోతే.. ఆర్సీబీ ప్లేఆఫ్ చాన్సులు మెరుగైనట్లే. మరోవైపు గుజరాత్ టైటాన్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైనా .. అప్పుడు ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ రెండూ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించినట్లే. కానీ పంజాబ్ కింగ్స్ , గుజరాత్ టైటాన్స్ ఈ రెండూ గెలిస్తే.. అప్పుడు వాటితో ఆర్సీబీ ప్లేఆఫ్స్ టాప్ 2 పొజిషన్ కోసం పోటీ పడాల్సి ఉంటుంది.
మరోవైపు ఆదివారం పంజాబ్, ఢిల్లీ రెండూ విజయం సాధిస్తే.. ప్లేఆఫ్స్ పోటీ అసక్తికరంగా మారుతుంది.