Rohit Sharma Fitness: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ లావు అవుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ గతంలో లాగా హెవీ వెయిట్ ఉన్నట్టు కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అతనికి పొట్ట కూడా ఎప్పటిలాగే వచ్చిందని దారుణంగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. విరాట్ కోహ్లీ తో రోహిత్ శర్మ మాట్లాడుతుండగా అతడి బాగోతం బయటపడిందని అంటున్నారు. ఇలా రోహిత్ శర్మ ఫిట్నెస్ పైన దృష్టి పెట్టకపోతే 2027 వన్డే వరల్డ్ కప్ ఆడటం కష్టమేనని కామెంట్స్ చేస్తున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ పై మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. గతంలో లాగా మళ్లీ రోహిత్ శర్మ బరువు పెరుగుతున్నాడని పోస్టులు వైరల్ చేస్తున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో ఎలాగైనా ఆడాలని రోహిత్ శర్మ గత రెండు సంవత్సరాలుగా మంచి ఫిట్నెస్ మైంటైన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే దాదాపు 25 కిలోలు తగ్గిపోయాడు. 20 ఏళ్ల కుర్రాడి తరహాలో మారిపోయాడు. అయితే ఫిట్నెస్ గా మారినప్పటికీ 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంటులో రోహిత్ శర్మ ఆడే విషయంపై ఇప్పటి వరకు బీసీసీఐ క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో ఫిట్నెస్ పై రోహిత్ శర్మ కూడా లైట్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే రోహిత్ శర్మ మళ్ళీ బరువు పెరుగుతున్నట్లు చర్చ మొదలైంది. మరి దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ అదిరిపోయే బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. మొదటి వన్డేలో 30కి పైగా పరుగులు చేసిన రోహిత్ శర్మ… రెండో వన్డేలో మాత్రం సెంచరీ తో దుమ్ము లేపాడు. ఈ క్రమంలో 12,000 పరుగుల మార్పు కూడా ఫినిష్ చేసుకున్నాడు. దీంతో మళ్లీ రోహిత్ శర్మ పై అంచనాలు భారీగా పెరిగాయి. 2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందు రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చాడని అతని అభిమానులు వెల్లడిస్తున్నారు. ఈ ఊపు ఇలాగే కొనసాగితే కచ్చితంగా వరల్డ్ కప్ గెలవడం ఈజీనే అని చెబుతున్నారు. రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లీ కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. వీళ్ళిద్దరూ బరిలోకి దిగితే… 2027 వన్డే వరల్డ్ కప్ గెలవడం సులభతరం అవుతుందని స్పష్టం చేస్తున్నారు.