WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో… డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bengaluru Women ) ఖాతా తెరిచింది. తొలి మ్యాచ్లో గ్రాండ్ విక్టరీ కొట్టి… పోరులోకి ఎంట్రీ ఇచ్చింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( RCB). మొదటి మ్యాచ్ లోనే గుజరాత్ జట్టు పైన ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి… చరిత్ర సృష్టించింది బెంగుళూరు. 200 కు పైగా పరుగుల లక్ష్యాన్ని… చేదించిన తొలి మహిళల జట్టుగా.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ( Wpl 2025 ) చరిత్ర సృష్టించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఇప్పటి వరకు… 200కు పైగా… చేజ్ చేసి గెలిచిన జట్టు… లేదని చెప్పవచ్చు. కానీ.. ఆ రికార్డు క్రియేట్ చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.
Also Read: Nz vs Pak Final: చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. సొంత గడ్డపై చిత్తు?
ఈ మొదటి మ్యాచ్ లో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్లు పెద్దగా రాణించకపోయిన మిడిల్ ఆర్డర్ అద్భుతంగా రాణించింది. ముఖ్యంగా చివర్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ రిచా గోష్ ( Richa Ghosh ) 64 పరుగులు చేసి దుమ్ము లేపింది. దీంతో బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట గుజరాత్ బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే బెంగళూరు బౌలర్లు పెద్దగా రాణించకపోవడంతో.. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. ఐదు వికెట్లు నష్టపోయిన గుజరాత్… 200 కు పైగా స్కోర్ చేసి… ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించింది. గుజరాత్ ( Gujarat Giants ) వికెట్ కీపర్ ముని… 56 పరుగులతో దుమ్ము లేపింది. 42 బంతుల్లోనే… 56 పరుగులు చేసి రాణించింది. ఆ తర్వాత.. వచ్చిన గుజరాత్ కెప్టెన్ గార్డినర్ 79 పరుగులతో రాణించారు. 37 బంతుల్లోనే మూడు బౌండరీలు అలాగే 8 సిక్సర్లు బాదిన గార్డినర్.. 79 పరుగులు చేసింది. చివర్లో.. దీనేంద్ర 25 పరుగులతో రాణించింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 200 కు పైగా పరుగులు చేసింది గుజరాత్.
Also Read: Lalit Modi – Sushmita Sen: 61 ఏళ్లలో లలిత్ మోడీ ఘాటు ప్రేమ.. మంచి ఆటగాడే ?
అటు బెంగళూరు బౌలర్లలో… రేణుక సింగ్ నాలుగు ఓవర్లు వేసి రెండు వికెట్లు పడగొట్టింది. అలాగే కైనిక, వారేహం, ప్రేమరావత్ తలో వికెట్ తీశారు. మిగతా బౌలర్లకు వికెట్ పడలేదు. ఇక 201 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో …. కెప్టెన్ స్మృతి మందాన వికెట్ త్వరగా కోల్పోయింది బెంగళూరు. కానీ ఆ తర్వాత వచ్చిన పెర్రి… 34 బంతుల్లో 57 పరుగులు చేసింది. ఇందులో రెండు సిక్సర్లు ఆరు బౌండరీలు ఉన్నాయి. ఆ తర్వాత వికెట్ కీపర్ రీఛా గోష్ 64 పరుగులు చేసి.. రాణించారు. రిచా ఘోష్ కు కైనిక మంచి పార్ట్నర్షిప్ కూడా అందించింది. ఆమె 30 పరుగులు చేయడం జరిగింది. దీంతో 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈ తరుణంలోనే ఆరు వికెట్ల తేడాతో.. గుజరాత్ ను చిద్ధి చేసింది.
– RCB Chased down the biggest Total in WPL history.
– RCB becomes the first team to chased down 200+ total in WPL history.
– THE DOMINATION OF RCB..!!!! 🔥 pic.twitter.com/09Tm1hhUKu
— Tanuj Singh (@ImTanujSingh) February 14, 2025