BigTV English

CSK VS RCB: చివరలో ధోని మెరుపులు… RCB రెండో విక్టరీ

CSK VS RCB: చివరలో ధోని మెరుపులు… RCB రెండో విక్టరీ

CSK VS RCB:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇక ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇవాళ ఎనిమిదవ మ్యాచ్ జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Chennai Super Kings vs Royal Challengers Bangalore ) జట్ల మధ్య… ఇవాళ బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్  దారుణంగా ఓడిపోయింది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ రెండు విభాగాల్లో కూడా… చెన్నై సూపర్ కింగ్స్ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఈ తరుణంలోనే… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది.


Also Read:  CSK vs RCB: RCB రికార్డులు బద్దలు కొట్టిన చెన్నై.. 24 గంటల్లోనే!
ఈ మ్యాచ్ లో 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం విజయం సాధించింది. చివర్లో ధోనీ మెరుపులు మెరుపుంచినప్పటికీ… అప్పటికే చేయి దాటిపోయింది మ్యాచ్. ఇక ఈ మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో… 8 వికెట్లు నష్టపోయిన చెన్నై సూపర్ కింగ్స్… 146 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఇక అంతకు ముందు… ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( ( Chennai Super Kings )… మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore )… నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పటిదర్ ( Rajat Patidar ) హాఫ్ సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. విరాట్ కోహ్లీ ( Virat Ko0hli ) 30 పరుగులు చేసినప్పటికీ… బంతులు ఎక్కువగా  తీసుకున్నాడు.

Also Read:  Shardul Thakur: పడి లేచిన కెరటం… Un sold ప్లేయర్ నుంచి తోపు ఆటగాడిగా రికార్డ్ !


మహేంద్రసింగ్ ధోని మెరుపులు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయినప్పటికీ… చెన్నయ్ అభిమానులకు చివర్లో మంచి ఎంటర్టైన్మెంట్ దొరికింది. ఈ మ్యాచ్లో మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) బ్యాటింగ్ కు దిగి రెచ్చిపోయాడు. 16 బంతుల్లో 30 పరుగులు చేసిన మహేంద్రసింగ్ ధోని… మూడు బౌండరీలు అలాగే రెండు సిక్సర్లు బాదేశాడు. 187.50 స్ట్రైక్ రేటుతో.. బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni ). అయితే మహేంద్రసింగ్ ధోని ఐదవ వికెట్ లేదా ఆరవ వికెట్ కు వస్తే బాగుండేది. కానీ చివర్లో వచ్చేసరికి… ధోని ఎంత చేసిన మ్యాచ్ మాత్రం గెలిచే పరిస్థితులు ఉండవు. ఆస్కింగ్ రేట్ విపరీతంగా ఉండటం… కారణంగా.. చెన్నై ఓడిపోవడం జరిగింది. ఈ తరుణంలోనే…చెన్నై సూపర్ కింగ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటు లో.. మొదటి ఓటమిని మూటగట్టుకుంది.

Related News

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

IND Vs PAK : టీమిండియా ఫ్యాన్స్ కు పాకిస్థాన్ ఆట‌గాడు ఆటోగ్రాఫ్‌…!

BCCI : బీసీసీఐలో ప్ర‌క్షాళ‌న‌..కొత్త అధ్య‌క్షుడు ఇత‌నే.. ఐపీఎల్ కు కొత్త బాస్

Big Stories

×