E-Paper
Advertisement

న్యాయమూర్తి కాదు యముడు.. 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. దెబ్బకు 100 హత్యకేసులు మరో కోర్టుకు బదిలీ

న్యాయమూర్తి కాదు యముడు.. 4 నెలల్లో 22 మందికి ఉరిశిక్ష.. దెబ్బకు 100 హత్యకేసులు మరో కోర్టుకు బదిలీ
Advertisement

100 Murder cases Transfer| ఒక అధికారి తన కర్తవ్యం సరిగా నిర్వర్తిస్తే అవినీతి, అక్రమాలు చేసే వారికి చెమటులు పడతాయి. అలాంటి నిజాయితీ గల అధికారుల పేర్లు చాలా అరుదుగా వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ఒక న్యాయమూర్తి పేరు వినగానే హత్య నేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, వారి లాయర్లు వణికిపోతున్నారు. ఎందుకంటే ఆ న్యాయమూర్తి ఫాస్ట్ ట్రాక్‌లో నిర్ణయాలు తీసుకుంటూ సంచలననాకి మారుపేరుగా మారారు. ఆయనే జడ్జి రవి కుమార్ దివాకర్. ఆయన పనితీరుకు భయపడి ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ కోర్టులో సుమారు 100 హత్య కేసులు మరో కోర్టుకు బదిలీ అయ్యాయి. ఈ కేసులు అన్నీ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవి కుమార్ దివాకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నవే. గత నాలుగు నెలల్లో ఆయన 10 కేసుల్లో 22 మందికి మరణ శిక్ష విధించారు. ఈ పరిణామం తర్వాత కేసులను జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టుకు మార్చారు.

కేసులను ఎందుకు బదిలీ చేశారు?

బదిలీ చేసిన కేసుల్లో మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉన్న నేరాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులను జిల్లా, సెషన్స్ జడ్జి వీరేంద్ర కుమార్ సింగ్ విచారణ చేయనున్నారు. మంగళవారం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ద్వారా కేసులను బదిలీ చేశారు. ముజఫర్‌నగర్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమోద్ త్యాగి ఈ విషయంపై స్పందించారు. న్యాయవాదులు, కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో మరణ శిక్ష విధించే అవకాశం గురించి భయాదోళనలు ఉన్నాయని ప్రమోద్ త్యాగి చెప్పారు. బదిలీ అయిన కేసుల్లో ఒక న్యాయవాది, హోమ్ గార్డ్, రైతు హత్య కేసులు ఉన్నాయి. ఒక కేసులో హైవే దోపిడీ తర్వాత జరిగిన హత్య కూడా ఉంది.

వరుస మరణ శిక్షలు విధించిన జడ్జి రవి కుమార్ దివాకర్

Advertisement

జడ్జి రవి కుమార్ వరుసగా మరణ శిక్షలు విధిస్తూ ముజఫర్‌నగర్ కోర్టులో సంచలనంగా మారారు.

  • ఏప్రిల్ 6న న్యాయవాది మహమ్మద్ సమీర్ హత్య కేసులో ముగ్గురికి మరణ శిక్ష విధించారు. సమీర్‌ను రూ.45 లక్షల ఆర్థిక వివాదం కారణంగా కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది.
  • ఏప్రిల్ 28న ఒక మహిళతో పాటు ఆమె ముగ్గురు కుమారులకు మరణ శిక్ష విధించారు.
  • మే 30న 15 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో మరో వ్యక్తికి మరణ శిక్ష విధించారు.  ఆ కేసులో ఒక మహిళ, ఆమె ఆరేళ్ల కుమారుడు హత్యకు గురయ్యారు.
  • జూన్ 20న రాజేంద్ర సైనీ హత్య కేసులో ఇద్దరికి మరణ శిక్ష విధించారు.
  • జూలై 2న విధుల్లో ఉన్న హోమ్ గార్డ్ రతిరామ్ హత్య కేసులో ఒకరికి మరణ శిక్ష ఇచ్చారు.
  • జూలై 6న 2010 హత్య కేసులో ఇద్దరికి మరణ శిక్ష విధించారు.
  • జూలై 17న ఒక రైతు హత్య కేసులో నలుగురికి మరణ శిక్ష విధించారు.
  • ఆగస్టు 12న 1999 కిడ్నాప్, హత్య కేసులో షహనవాజ్‌ అనే వ్యక్తికి మరణ శిక్ష విధించారు.
  • ఆగస్టు 13న 2014 నాటి హత్య కేసులో నలుగురికి మరణ శిక్ష విధించారు.

Also Read: నల్లధనం ఉందా మా దగ్గరకు రండి.. బంగారం, కళాఖండాలు దాచుకోవడానికి బంకర్లు.. ప్రైవేట్ కంపెనీ ఆఫర్

ఉత్తరప్రదేశ్‌లో మరణ శిక్షలపై చర్చ

Advertisement

2025లో ఉత్తరప్రదేశ్ ట్రయల్ కోర్టులు 20 కేసుల్లో 28 మరణ శిక్షలు విధించాయి. ఈ వివరాలను నల్సార్ యూనివర్సిటీకి చెందిన స్క్వేర్ సర్కిల్ క్లినిక్ నివేదిక వెల్లడించింది. అయితే సెషన్స్ కోర్టు విధించిన మరణ శిక్ష వెంటనే అమలు కాదు. భారత చట్టం ప్రకారం హైకోర్టు ఆ శిక్షను తప్పనిసరిగా నిర్ధారించాలి.

రవి కుమార్ దివాకర్ ఎవరు?

రవి కుమార్ దివాకర్ 1980 జూలైలో జన్మించారు. 2009లో సివిల్ జడ్జిగా నియమితులై ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పనిచేశారు. సుల్తాన్‌పూర్, బదౌన్, వారణాసి, బరేలీ జిల్లాల్లో ఆయన సేవలందించారు. 2025 నవంబర్‌లో ఆయన ముజఫర్‌నగర్‌కు వచ్చారు.

Also Read: రిటైర్మెంట్ అంటే భయపడుతున్న భారతీయులు.. ఏ వయసు నుంచి ప్లానింగ్ ప్రారంభించాలి?

2022లో వారణాసి జడ్జిగా జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలో రవి కుమార్ ఆధ్వర్యంలో వీడియో సర్వే జరిగింది. ఆ ఆదేశం తర్వాత తనకు బెదిరింపులు వచ్చాయని ఆయన తెలిపారు.
2024లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని విమర్శిస్తూ జడ్జి రవికుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి. తర్వాత అలహాబాద్ హైకోర్టు ఆ వ్యాఖ్యలను ఉత్తర్వుల నుంచి తొలగించింది. తాజాగా రవి కుమార్ మరణ శిక్షల తీర్పుతో భయపడి 100 హత్య కేసులు మరో కోర్టకు బదిలీ కావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Related News

‘ఆవేశంలో నోరు జారా.. డిప్రెషన్‌లోకి వెళ్లా’.. సైన్యానికి Gen Z యువతి క్షమాపణ

SBI ఉద్యోగి ఘోరం.. భార్య, చెల్లిని చంపి.. హనుమాన్ చాలీసా వింటూ ఆత్మహత్య!

దక్షిణ మండలి సమావేశం.. అమిత్ షాకు విజయ్ సహా.. సౌత్ సీఎంలు కీలక ప్రతిపాదనలు!

వందేమాతరం రచ్చ.. ఓటు బ్యాంక్ vs దేశ భక్తి.. కాంగ్రెస్‌‌ను చీల్చిచెండాడిన అమిత్ షా..!

ప్రభుత్వం బంపరాఫర్.. పథకాలు ప్రమోట్ చేస్తే.. ఒక్కో వీడియోకు రూ.లక్ష బహుమానం!

కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. దిల్లీలోని పాక్ హైకమిషన్‌పై బుల్డోజర్ యాక్షన్!

ఐఫోన్, బైక్ కోసం.. ప్రియుడితో కలిసి తాతను చంపించిన 13 ఏళ్ల బాలిక!

Big Stories

Advertisement
×