Sania Mirza Second Marriage: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ( (Sania Mirza ) పెళ్లి గురించి మరోసారి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆమె రెండో పెళ్లికి (Sania Mirza Second Marriage ) సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో ఇవ్వాళ ఉదయం నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. మరోసారి విదేశీ వ్యక్తినే ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు పోస్టులు కూడా పెడుతున్నారు. సదరు విదేశీ వ్యక్తితో చాలా రోజుల నుంచి ఆమె రిలేషన్ లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దుబాయ్ లోనే ఉంటున్న ఆమె, సింగిల్ లైఫ్ కు గుడ్ బై చెప్పి… ఈ రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా విదేశాలకు చెందిన తన స్నేహితుడితో సానియా మీర్జా సీక్రెట్ రిలేషన్ మైంటైన్ చేస్తున్నారట. అతడిది దుబాయ్ అని తెలుస్తోంది. అందుకే ఆమె 2021లోనే దుబాయిలో ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేసి నివాసం ఉంటున్నట్లు చెబుతున్నారు. ఇక ఇప్పుడు తన కుటుంబ సభ్యులను ఒప్పించి, రెండో వివాహానికి సిద్ధమయ్యారట. ఈ న్యూస్ ఆ నోట ఈ నోట పడి, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇప్పటి వరకు సానియా మీర్జా కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే, మాత్రం దుబాయ్ లో అత్యంత కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే వీళ్ళ వివాహం జరుగబోతోందని కూడా చర్చ మొదలైంది. రెండో పెళ్లి జరిగితే, దుబాయ్ లోని తన అపార్ట్ మెంట్ లోనే సానియా కాపురం చేయనున్నట్లు కూడా స్పష్టం చేస్తున్నారు.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2010లో ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్యయుద్ధ వాతావరణ ఉన్నప్పటికీ కూడా, ఆమె షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ జంటకు ఇజాన్ అనే కుర్రాడు కూడా ఉన్నాడు. అయితే 14 సంవత్సరాల వైవాహిక బంధం తర్వాత… సానియా, మాలిక్ ఇద్దరు విడిపోయారు. ఇద్దరి మధ్య మరో మహిళ చిచ్చు పెట్టిన నేపథ్యంలో 2024 జనవరిలో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత వెంటనే పాకిస్తాన్ నటి సనా జావేద్ ను మూడో వివాహం చేసుకున్నాడు షోయబ్ మాలిక్. దీంతో అప్పటినుంచి దుబాయ్ లోనే సానియా మీర్జా తన కొడుకుతో కలిసి నివసిస్తున్నారు. ఇక ఇప్పుడు తన కొడుకుకు ఒక తోడు కావాలన్నా కారణంతో రెండో పెళ్లికి సిద్ధమైనట్లు చెబుతున్నారు.