Sanju Samson – IND VS WI: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ ( India vs West Indies) మధ్య టీ20 సిరీస్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే తొలి టి20 మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా…రాంచీ (JSCA International Stadium Complex, Ranchi ) వేదికగా విండీస్ తో రెండో మ్యాచ్ ఆడింది. ఈ క్రమంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా అదరగొట్టింది. ముఖ్యంగా సంజు శాంసన్ (Sanju Samson) ఓపెనర్ గా బరిలోకి దిగి అదరగొట్టాడు. కేవలం 41 బంతులు ఎదుర్కొన్న సంజు శాంసన… 82 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సిక్సర్లతో పాటు తొమ్మిది బౌండరీలు ఉన్నాయి. 200 స్ట్రైక్ రేట్ తో ఇరగదీసాడు. బ్యాటింగ్ ఇరగదీసిన సంజు శాంసన్ సెంచరీ మాత్రం మిస్ చేసుకున్నాడు.
వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs West Indies) మధ్య జరిగిన తొలి T20 సందర్భంగా సంజు శాంసన్ (Sanju Samson) ఫస్ట్ డౌన్ లో వచ్చి విఫలమయ్యాడు. ఆ సమయంలో గౌతమ్ గంభీర్…. సంజు శాంసన్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఎందుకు ఆడుతున్నావురా? అన్నట్టుగా ఫేస్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. అయితే రెండో T20 సందర్భంగా ఓపెనర్ గా దిగిన సంజు దుమ్ము లేపాడు. దీంతో సంజును మళ్లీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ప్రశంసించాడు. ఈ క్రమంలో గంభీర్ పై సంజు అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా సంజుకు ఎక్కువగా చాన్సులు ఇవ్వాలని కౌంటర్ ఇస్తున్నారు. అనవసరంగా వైభవ్ కోసం సంజు కెరీర్ నాశనం చేయొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. ఇది ఇలా ఉండగా, టీమిండియా ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా, 249 పరుగులు సాధించింది.
🔴 FINALLY, HEAD COACH IS HAPPY WITH SANJU SAMSON 😍
– Pic 1: When Sanju got out early, Gautam Gambhir looked unhappy.
– Pic 2: Today, when Sanju scored runs and smashed a half-century, GG was seen smiling and celebrating. 😀 pic.twitter.com/u0niJcuf2K
— Sam (@cricsam02) October 9, 2026