BigTV English

Sailesh Kolanu: హిట్ యూనివర్స్ మధ్యలో బ్రేకులు

Sailesh Kolanu: హిట్ యూనివర్స్ మధ్యలో బ్రేకులు

Sailesh Kolanu: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో నాగ వంశీ ఒకరు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ దర్శకుడిగా ఎన్నో సినిమాలను నిర్మించారు నిర్మాత సూర్యదేవర చినబాబు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మితమయ్యే కొన్ని సినిమాలుకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ బాధ్యతలు చేపట్టేవాడు. అయితే ఆ బ్యానర్లో కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే సినిమాలు చేయడంతో దానికి అనుసంధానంగా సితార ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక బ్యానర్ ని మొదలుపెట్టి మిగతా దర్శకులతో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ను నాగ వంశీ చాలా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఈ బ్యానర్ విషయానికొస్తే మంచి సక్సెస్ రేట్ ఉంది అని చెప్పాలి. ఒక సందర్భంలో నిర్మాత దిల్ రాజు కూడా వంశీని చూస్తే నన్ను నేను చూసుకుంటున్నట్లు ఉంది అని అన్నారు.


క్రేజీ కాంబినేషన్ సెట్ చేయడంలో సితార నాగ వంశీ ముందు వరుసలో ఉంటాడు. అలానే ట్విట్టర్ లో కూడా యాక్టివ్ గా ఉంటూ ఉంటాడు. కొన్ని సినిమాలకు నాగ వంశీ ఇచ్చే హైప్ వేరే రేంజ్ లో ఉంటుంది. చాలా సందర్భాలలో నాగవంశీ ఇచ్చిన హైప్ తో థియేటర్ కు వెళ్లి డిసప్పాయింట్ అయిన ఆడియన్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు కారం సినిమాకి ఇదే జరిగింది. ఈ బ్యానర్లో ప్రస్తుతం యంగ్ డైరెక్టర్స్ అంతా వరుసగా సినిమాలు చేస్తున్నారు. గౌతం తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న సామ్రాజ్యం సినిమా ఈ బ్యానర్ లో మంచి హైప్ ఉన్న ప్రాజెక్ట్. సినిమాకి సీక్వెల్ గా మాడ్ స్క్వేర్ సినిమా కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. చాలామంది నిర్మాతలకు మంచి కాంబినేషన్ సెట్ చేయాలి అని కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అలానే నెల్సన్ తో కూడా ఒక సినిమా చేయాలి అని సితార వంశీ ఒక సందర్భంలో చెప్పాడు.

ఇకపోతే ప్రస్తుతం హిట్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ అయిన శైలేష్ కొలను మంచి సక్సెస్ అందుకున్నాడు. అడవి శేష్ నటించిన హిట్ 2 సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఇక హిట్ యూనివర్స్ బయటకు వచ్చి శైలేష్ చేసిన సినిమా సైంధవ్ ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ప్రస్తుతం ఈ దర్శకుడు నానితో హిట్ 3 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శైలేష్ దర్శకుడుగా రామ్ పోతినేని హీరోగా ఒక మంచి ప్రాజెక్టు సెట్ చేయడానికి ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాడు సితార నాగ వంశీ. ఈ ప్రాజెక్టు గురించి చర్చలు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాయి. ఇది వర్క్ అవుట్ అయి సినిమా చేస్తే అధికారికంగా ప్రకటించనున్నారు.


Also Read : Happy birthday Sharwanand : మంచితనం వ్యక్తిత్వం సరిపోవు శర్వా , స్టోరీ సెలక్షన్ కూడా బాగుండాలి

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×