Shahi Tharoor: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు ఎంపికైంది. ఈ టోర్నీకే కాదు దీనికంటే ముందు జరిగే ఇంగ్లాండ్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ కి కూడా ఇదే జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. జనవరి 18 శనివారం రోజున ఈ జట్టుని ప్రకటించారు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్. అయితే బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన జట్టులో వికెట్ కీపర్ సంజూ శాంసన్ కి చోటు దక్కలేదు. ఇటీవలి కాలంలో ఫుల్ ఫామ్ లో ఉన్న శాంసన్ ని ఎంపిక చేయకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read: Kho Kho World Cup final: ఖోఖో తొలి వరల్డ్ కప్ విజేతగా టీమిండియా
శాంసన్ ని కాదని వికట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, రీషబ్ పంత్ ని బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే సంజూ ని ఎంపిక చేయకపోవడంపై కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసిఏ) అధ్యక్షుడు జయేష్ జార్జ్ తీవ్రంగా మండిపడ్డారు. విజయ్ హజారే ట్రోఫీలో సంజూ రాష్ట్ర జట్టు తరపున ఆడలేదని.. ఆ కారణంగానే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేదని భావిస్తున్నామన్నారు. అతడు క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించలేదన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ కూడా కేరళ క్రికెట్ అసోసియేషన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ మధ్య జరిగిన శిక్షణ శిబిరానికి హాజరు కాలేకపోయిన విషయాన్ని సంజు ఇప్పటికే కేరళ క్రికెట్ అసోసియేషన్ కి తెలిపాడని అన్నారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసిఏ) పై తీవ్రంగా మండిపడ్డారు శశిధరూర్. అంతేకాదు విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ టోర్నమెంట్ల మధ్య శిక్షణ శిబిరానికి హాజరు కాలేకపోయినందున విచారం వ్యక్తం చేస్తూ సంజూ కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసిఏ) కి లేఖ రాశారని.. ఆ తర్వాతే అతడిని కేరళ జట్టు నుంచి తొలగించారని ఆరోపించారు.
ఈ కారణంగా ప్రస్తుతం జాతీయ జట్టు నుంచి తొలగించారని విమర్శించారు శశిథరూర్. సంజూ విజయ్ హజారే ట్రోఫీలో (212*) పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడని.. టీమిండియా తరపున వన్డేల్లో సగటున 56.36 సగటుతో దక్షిణాఫ్రికా తో జరిగిన చివరి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ సంజూ అని అన్నారు. అలాంటి క్రికెటర్ కెరీర్ క్రికెట్ నిర్వహకుల అహంకారం కారణంగా నాశనమవుతుందన్నారు. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ఎంపిక చేసే క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ – కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య తీవ్ర చర్చలు జరిగినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గౌతమ్ గంభీర్ అడిగిన కొన్ని విషయాలను సెలక్టర్ అజిత్ అగర్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించలేదని సమాచారం బయటకు వచ్చింది. జట్టులో వికెట్ కీపర్ స్థానం కోసం గౌతమ్ గంభీర్ సంజూ శాంసన్ పేరుని ప్రస్తావించారట. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ, సెలెక్టర్ అజిత్ అగర్కర్ మాత్రం పంత్ ఉండాలని స్పష్టం చేశారట. సంజూ ని జట్టులోకి తీసుకునేందుకు వీరు నిరాకరించారని సమాచారం. ఇటీవల సంజు దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీకి డుమ్మా కొట్టాడని.. ఈ క్రమంలో సంజుపై సెలెక్టర్లు గుర్రుగా ఉన్నారని సమాచారం.
Also Read: ICC U19 Women’s T20 World Cup: ఖాతా తెరిచిన టీమిండియా.. విండీస్ పై గ్రాండ్ విక్టరీ
ఈ నేపథ్యంలోనే సెలక్టర్లు పంత్ వైపు మొగ్గు చూపారని పలు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంలో పలువురు నెటిజన్లు రోహిత్ శర్మ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సంజు వన్డే, టి-20 ఫార్మాట్ లలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని.. అలాంటి ఆటగాడిని తప్పించడం మంచిది కాదని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సంజూ విషయంలో పొలిటీషియన్స్ కూడా స్పందించడంతో ఈ విషయంపై రాజకీయ దుమారం రేగుతోంది.