E-Paper
Advertisement

కోహ్లీ చేసిన ఆ చెత్త ప‌నికి బండ‌బూతులు తిట్టా…శిఖ‌ర్ ధావ‌న్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

కోహ్లీ చేసిన ఆ చెత్త ప‌నికి బండ‌బూతులు తిట్టా…శిఖ‌ర్ ధావ‌న్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు
Advertisement

Shikhar Dhawan Angry On Virat Kohli:  టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఒక‌ప్పుడు అంత‌ర్జాతీయ క్రికెట్ ను ఏలిన సంగ‌తి తెలిసిందే. హిట్ మాన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగి, ఎన్నో విజయాలను టీమిండియాకు అందించాడు ఈ గబ్బర్. అయితే టీమిండియా ప్రస్తుత కెప్టెన్ శుభమాన్‌ గిల్ ఎంట్రీ నేపథ్యంలో శిఖర్ ధావన్ కెరీర్ ముగిసింది అని చెప్పవచ్చు. అయితే అలాంటి శిఖర్ ధావన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ కారణంగా తాను ఒకానొక సమయంలో రనౌట్ అయినట్లు వెల్లడించారు. అనవసరంగా పరుగు కోసం విరాట్ కోహ్లీ పిలిచి.. నన్ను రనౌట్ చేశాడని బాంబు పేల్చాడు శిఖర్ ధావన్. ఆ సమయంలో తనకు కోపం కట్టలు తెంచుకుందని తెలిపారు. దీంతో మైదానం నుంచి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లే వరకు విరాట్ కోహ్లీని బండ బూతులు తిట్టినట్లు గుర్తు చేశారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న శిఖర్ ధావన్, 2018 సంవత్సరంలో జరిగిన సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

శిఖ‌ర్ ధావ‌న్ ను ర‌నౌట్ చేసిన విరాట్ కోహ్లీ

2018 ఫిబ్రవరి ఒకటో తేదీన డ‌ర్బన్ వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మొదటి వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్ 35 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. అనవసరంగా పరుగు కోసం శిఖర్ ధావన్ ను విరాట్ కోహ్లీ పిలిచాడు. ఈ క్రమంలో ఇద్దరు మధ్య కో-ఆర్డినేషన్ మిస్సైంది. ఇంకేముంది ఐడెన్ మార్క్రమ్ డైరెక్ట్ త్రో కొట్టి ధావన్ ను పెవిలియన్ కు పంపించాడు. ఈ క్ర‌మంలో విరాట్ కోహ్లీని ధావ‌న్ బండ బూతులు తిట్టారు.

Advertisement

Major Gaurav Arya On Pak: పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

అంద‌రి ముందే విరాట్ కోహ్లీని ప‌చ్చి బూతులు తిట్టా – ధావ‌న్

2018 ఫిబ్రవరి ఒకటో తేదీన ధర్బన్ వేదికగా జరిగిన మ్యాచ్ సందర్భంగా రన్ అవుట్ అయిన నేపథ్యంలో తాను విరాట్ కోహ్లీని బండబూతులు తిట్టినట్లు తాజాగా శిఖర్ ధావన్ గుర్తు చేసుకున్నారు. ఈ రన్ అవుట్ లో విరాట్ కోహ్లీదే తప్పని.. అందుకే రన్ అవుట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ దాకా నడుచుకుంటూ బండ బూతులు తిట్టినట్లు వెల్లడించారు. అంత‌కు ఐపీఎల్ వేలంలో త‌న‌కు స‌రైన ధ‌ర రాలేద‌న్న కోపంతో ఉన్నానని తెలిపారు. అదే స‌మ‌యంలో ర‌నౌట్ కావ‌డంతో కోహ్లీపై విరుచుకుప‌డ్డాన‌ని వెల్ల‌డించారు. అయితే, ఆ తర్వాత తామిద్దరం కలిసి ఫీల్డింగ్ కూడా చేసినట్లు వివరించారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడం కామన్ అంటూ వ్యాఖ్యానించారు గ‌బ్బ‌ర్. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో చాలా సార్లు రికార్డు భాగస్వామ్యాలు నమోదు అయ్యాయి. 60.17 సగటుతో చాలా సార్లు వన్డేల్లో అద్భుతంగా రాణించారు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్.

Advertisement

Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

 

Related News

టీమిండియా క్రికెట‌ర్ల జ‌ల్సాల‌కు BCCI చెక్‌…తెర‌పైకి కొత్త ఫిట్ నెస్ టెస్టులు!

రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో ఆడ‌తాను…షాదాబ్ ఖాన్ సంచ‌ల‌నం ?

బాబ‌ర్ ఆజంతో ఇర్ఫాన్ ప‌ఠాన్ సీక్రెట్ మీటింగ్…పాక్ మీడియా సంచ‌ల‌నం?

టీమిండియాను దెబ్బ‌కొట్టేందుకు న‌ఖ్వీ మ‌రో కుట్ర‌..బాబ‌ర్ కు ఆ కండీష‌న్ పెట్టి మ‌రీ !

న‌న్ను ప‌శువుల‌ కంటే హీనంగా చూశారు..PCBపై పాక్ బౌలర్ తిరుగుబాటు

వెస్టిండీస్ ను ఓడించాం, నా నెక్ట్స్ టార్గెట్ టీమిండియానే

అబ్దుల్లా షఫీక్ పాకిస్తాన్ సింహం…మావోడి ముందు గిల్ దేనికి ప‌నికిరాడు

Big Stories

Advertisement
×