Shoaib Akhtar on Mohammad Rizwan: పాకిస్తాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ ఎదుర్కొంటున్న పరిస్థితులపై మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్ రిజ్వాన్ కెరీర్ క్లోజ్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని బాంబు పేల్చారు. అతడు ఇలాంటి తప్పు చేయకుండా… కొంతమంది పాకిస్తాన్ వెధవలె, మహమ్మద్ రిజ్వాన్ ను టార్గెట్ చేసినట్లు ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేసిన తప్పిదాలను మహమ్మద్ రిజ్వాన్ పై రుద్దడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్. పాకిస్తాన్ కు ఎన్నో విజయాలను అందించిన మహమ్మద్ రిజ్వాన్ ను ఇలా అవమానిస్తే, ఇలా అంటూ ప్రశ్నించారు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. అలా కాదని మహమ్మద్ రిజ్వాన్ పై ఒత్తిడి చేస్తే మాత్రం… అతడు ఆత్మహ**త్య చేసుకునే ప్రమాదం పొంచి ఉందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
పాకిస్తాన్ వికెట్ కీపర్ మహమూద్ రిజ్వాన్ ఇంగ్లాండ్ పర్యటన సమయంలో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కు పాల్పడినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గుర్తించిందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడే మహమ్మద్ రిజ్వాన్ మొబైల్స్ లాక్కుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అంతేకాకుండా ఈ కేసును ఓ ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ బృందానికి అప్పగించింది. ఆ తర్వాత ఈ బెట్టింగ్ ఆరోపణల నేపథ్యంలో గురించి వివరణ ఇవ్వాలని మహమ్మద్ రిజ్వాన్ కు సదరు ఇన్వెస్టిగేషన్ బృందం నోటీసులు కూడా జారీ చేసింది.
అయితే ఈ నోటీసులను సవాల్ చేస్తూ లాహోర్ హైకోర్టును తాజాగా ఆశ్రయించాడు మహమ్మద్ రిజ్వాన్. అక్కడ కూడా రిజ్వాన్ కు ఎదురు దెబ్బ తగిలింది. దీంతో చేసేది ఏమీ లేక.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు మహమ్మద్ రిజ్వాన్ వెళ్ళాడు. మీరే నన్ను కాపాడాలని… ఐసీసీ బాస్ జై షా కు లేక కూడా రాశాడు. తన తప్పు లేకున్నా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసుల్లో ఐసీసీ విచారణ చేయాలి తప్ప… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రత్యేకంగా విచారించడం తప్పని పేర్కొన్నారు. దీనిపై వెంటనే ఐసీసీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై ఇప్పటివరకు కూడా ఐసీసీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
మహమ్మద్ రిజ్వాన్ ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కావాలని టార్గెట్ చేసిందని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సోషల్ మీడియా వేదికగా సీరియస్ అయ్యారు. పాకిస్తాన్ కు గతంలో ఎన్నో విజయాలు అందించిన రిజ్వాన్ ను ఇప్పుడు అందరూ ఒంటరి చేశారని ఆగ్రహించారు. ఈ రిజ్వాన్ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరు ఏమాత్రం కరెక్ట్ కాదన్నారు. అతని జీవితాన్ని కాపాడాలని కోరారు.