Shoaib Akhtar : టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పేద కుటుంబం నుంచి వచ్చిన విరాట్ కోహ్లీ టీమిండియాలో రేంజ్ కు వెళ్లాడు. టీమిండియాలో అడుగుపెట్టిన నుంచి ఇప్పటి వరకు వేలాది పరుగులు చేసి… సచిన్ సరసన చేరాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో కూడా టీమిండియా అనేక ట్రోఫీలు దక్కించుకుంది. సెంచరీలు అలాగే అర్థ సెంచరీలు చేసి సరికొత్త చరిత్రలు సృష్టించాడు. అయితే అలాంటి విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ అందరూ అనుకున్నట్లుగా టాలెంటెడ్ బ్యాటర్ కాదని పరువు తీశారు. తాను రిటైర్మెంట్ కాక ముందు విరాట్ కోహ్లీ టీమిండియాలోకి వచ్చి ఉంటే… అతని కెరీర్ నాశనం చేసే వాడిని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన బౌలింగ్ తో ముప్ప తిప్పలు పెట్టే వాడిని అంటూ హెచ్చరించారు. దీంతో పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) చేసిన వ్యాఖ్యలు దుమారం వేగుతున్నాయి.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ హాట్ కామెంట్స్ చేశారు. విరాట్ కోహ్లీ పెద్ద క్రికెటర్ అంటూ సోషల్ మీడియాలో చాలా రచ్చ చేస్తూ ఉంటారని… కానీ తన దృష్టిలో మాత్రం అతడు చేతకాని దద్దమ్మ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. తన హయాంలో అంతర్జాతీయ అరంగేట్రం చేసి, ఉంటే విరాట్ కోహ్లీ కెరీర్ ను అంతం చేసే వాడిని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ స్టేడియం నలువైపులా షాట్లు ఆడలేడని… అతనికి కూడా వీక్నెస్ లు ఉన్నాయని ఘాటుగా స్పందించారు. కట్ షాట్లు ఆడడంలో విరాట్ కోహ్లీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడని గుర్తు చేశారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విధానాన్ని చాలా సార్లు తాను రూమ్ లో కూర్చొని చూశానని వ్యాఖ్యానించారు షోయబ్ అక్తర్.
ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ కట్ షార్ట్ ఆడడంలో ఇబ్బంది పడ్డ విషయాన్ని తాను గుర్తించినట్లు వెల్లడించారు. అయితే విరాట్ కోహ్లీ తన హయాంలో అరంగేట్రం చేసి, ఉంటే… అతడి కెరీర్ ను కచ్చితంగా నాశనం చేసే వాడిని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చి.. బతికి బయటపడ్డాడని ఘాటుగా స్పందించారు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ సమయంలో విరాట్ కోహ్లీ వచ్చి ఉంటే… అతడు ఇన్ని రికార్డులు సాధించక పోయేదని వ్యాఖ్యానించారు. ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లోకి రావడం వల్ల ఇన్ని రికార్డులు సాధ్యమయ్యాయని తెలిపారు. ఇప్పటి మైదానాలు బ్యాటర్లకు అనుకూలంగా తయారు చేస్తున్నారని… అందుకే ఇండియన్ క్రికెటర్లు రెచ్చిపోయి సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అప్పట్లో బౌలర్లకు అనుకూలంగా మైదానాలు ఉండేవని.. ఈ నేపథ్యంలో తాను సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్లకు చుక్కలు చూపించినట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీపై షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది