Shoaib Akhtar On Team India Squad: 2027 వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి మరో ఏడాది సమయం ఉన్నప్పటికీ… ఇప్పటినుంచి అన్ని జట్లు ప్రిపేర్ అవుతున్నాయి. అటు ఈ టోర్నమెంట్ కు సంబంధించిన వేదికలు గ్రూప్స్ ఇప్పటికే ఫైనల్ అయ్యాయి. ఇలాంటి క్రమంలో 2027 వన్డే వరల్డ్ వరల్డ్ కప్ (2027 ODI World Cup ) ఆడే టీం ఇండియా ప్లేయర్లను పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar On Team India Squad) అంచనా వేశారు. అయితే ఈ జట్టులో ఫాస్ట్ బౌలర్లు కీలక పాత్ర పోషిస్తారని వెల్లడించారు. అందుకే బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ అలాగే భువనేశ్వర్ కుమార్ లను బరిలోకి దించాలని బిసిసిఐకి రిక్వెస్ట్ చేశారు. అప్పుడే దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా గట్టి పోటీ ఇస్తుందని వ్యాఖ్యానించారు.
2027 వన్డే వరల్డ్ కప్ (2027 ODI World Cup ) నేపథ్యంలో తాజాగా టీమిండియా జట్టు సభ్యులను పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అంచనా వేశారు. దీని ప్రకారం శుభమాన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ సీనియర్ బ్యాటర్లుగా బరిలోకి దిగుతారు. టి20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను వరల్డ్ కప్ లోకి తీసుకోవాలని సూచనలు చేశారు. వికెట్ కీపర్ గా కె ఎల్ రాహుల్ తో పాటు ఇషాన్ కిషన్ ను తీసుకోవాలని వివరించారు.
రిషబ్ పంత్ కంటే ఇషాన్ కిషన్ బెటర్ అన్నారు. గాయం బారిన పడిన హార్దిక్ పాండ్యాను కచ్చితంగా జట్టులో ఉంచాల్సిందేనని… అదనంగా నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంటే బెటర్ అన్నారు. స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా బరిలోకి దిగే ఛాన్సులు ఉన్నాయని వివరించారు. ఇక ఫాస్ట్ బౌలర్లుగా మహమ్మద్ సిరాజ్, బుమ్రా, మహమ్మద్ షమీతో పాటు బుమ్రా ఉండాలని కోరారు. హర్షిత్ రాణాను తీసుకునే ప్రయత్నం అస్సలు చేయకూడదని బీసీసీఐకి సూచనలు చేశారు.
దక్షిణాఫ్రికా గడ్డపై మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, బుమ్రా అలాగే భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణిస్తారని షోయబ్ అక్తర్ అంచనా వేశారు. దక్షిణాఫ్రికాలో ఫాస్ట్ బౌలర్లకు మైదానాలు అనుకూలిస్తాయని వివరించారు. అక్కడి మైదానాలను ఈ నలుగురు ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా వినియోగించుకుంటారని స్పష్టం చేశారు. దీనివల్ల టీమిండియా కు మంచి ఫలితాలు వస్తాయని కూడా పేర్కొన్నారు. అందుకే ఈ నలుగురిని తీసుకుంటే టీమిండియా వరల్డ్ కప్ గెలవడం గ్యారెంటీ అని అంచనా వేశారు.