Shoaib Akhtar On Sourav Ganguly: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అందరూ ఉత్కంఠ భరితంగా చూస్తూ ఉంటారు. ఓ యుద్ధం తరహాలోనే.. ఈ మ్యాచ్ ను ట్రీట్ చేస్తారు. ఇలాంటి పరిణామాలు నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పైన ప్రశంసల వర్షం కురిపించారు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్. సౌరవ్ గంగూలీ కారణంగానే టీమ్ ఇండియా ఈ స్టేజిలో ఉందని వ్యాఖ్యానించారు. మహేంద్ర సింగ్ ధోనీని.. వెతికి తీసుకువచ్చింది సౌరవ్ గంగూలీనే అంటూ సంచలన ప్రకటన చేశారు. అతని కెప్టెన్సీలో తాను కూడా ఆడి ఉంటే… తన తలరాత మారేది అని వ్యాఖ్యానించారు. కానీ దురదృష్టవశాత్తు… పాకిస్తాన్ లో తాను పుట్టానని ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సారథ్యంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించారు. సౌరవ్ గంగూలీ లాంటి కెప్టెన్ ఉండడం టీమిండియా ప్లేయర్ల అదృష్టం అన్నారు. అతని హయాంలో చాలామంది యంగ్ క్రికెటర్లను జట్టులోకి తీసుకువచ్చాడని గుర్తు చేశారు. ఇండియాలో పుట్టి ఉంటే… తాను ఐదు సంవత్సరాల ముందే… అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించే వాడినని వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్ లో పుట్టడం వల్ల… తన అంతర్జాతీయ క్రికెట్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ఇండియాలో ఉండుంటే తనను ఎప్పుడో సౌరవ్ గంగూలీ గుర్తించి… అంతర్జాతీయ క్రికెట్ లోకి తీసుకువచ్చే వాడని తెలిపారు. పాకిస్తాన్ కెప్టెన్ గా ఇమ్రాన్ ఖాన్ ఉన్న కూడా తన కెరీర్ మారిపోయేదని వ్యాఖ్యానించారు. తన దురదృష్టం వల్ల ఇతర కెప్టెన్లు ఉన్న సమయంలో తన కెరీర్ ప్రారంభమైందని ఎమోషనల్ అయ్యారు.
2007 కంటే ముందు మహేంద్ర సింగ్ ధోనిని.. అతని టాలెంట్ ను సౌరవ్ గంగూలీ ముందుగా గుర్తించాడని వెల్లడించారు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్. జార్ఖండ్ వెళ్లి… పిచ్చోడిలా తిరిగాడని గుర్తు చేశారు. చివరికి ఝార్ఖండ్ డైనమెట్ ధోనిని పట్టుకున్నాడని.. ఆ తర్వాత జట్టులోకి తీసుకువచ్చాడని ప్రశంసించారు. ధోని వల్ల రెండు వరల్డ్ కప్ ట్రోఫీలు వచ్చాయంటే.. దానికి కారణం సౌరవ్ గంగూలీ అని వెల్లడించారు. షోయబ్ అక్తర్ చెప్పినట్లుగానే, ధోని కెప్టెన్సీలో టీమిండియాకు వరుసగా ట్రోఫీలు వచ్చిన సంగతి తెలిసిందే. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీలు టీమిండియాకు దక్కాయి. 2013లో చాంపియన్స్ ట్రోఫీ కూడా టీమిండియానే దక్కించుకుంది.