Sunil Gavaskar On IND VS PAK: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య పదే పదే ఐసీసీ మ్యాచ్ లు నిర్వహించడంపై మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా, పాక్ మ్యాచ్‌లే జరగకపోతే, ఐసీసీ రోడ్డున పడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు జట్లు మధ్య మ్యాచ్ లు లేకపోతే ఐసీసీ మనుగడ కష్టమేనన్నారు. ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ సిరీస్ వల్ల ఐసీసీ బతకడం కష్టమేనని కుండ బద్దలు కొట్టారు.
క్రికెట్ కే పెద్ద అన్న అయిన ఐసీసీకి కోట్లల్లో నిధులు నిత్యం రావాల్సిందేనన్నారు. అలా డబ్బులు రాకపోతే, ఐసీసీ నడవడమే కష్టమన్నారు. ఇలాంటి తరుణంలోనే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య పదే పదే మ్యాచ్ లు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య రాజకీయకీయ పరంగా గొడవలు ఉన్నప్పటికీ, మ్యాచ్ లు మాత్రం ఆడుతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీంతో సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఐసీసీ టోర్నమెంట్స్ లలో టీమిండియా, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ లు జరిగితే, కోట్లల్లో డబ్బులు వస్తాయని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ వెల్లడించారు. ఇతర జట్ల మధ్య జరిగే మ్యాచ్ ల కంటే, 200 శాతం ఎక్కువ ఆదాయం టీమిండియా, పాక్ మ్యాచ్ ద్వారా జనరేట్ అవుతాయని స్పష్టం చేశారు. ఇలా వచ్చిన డబ్బులతో చిన్న దేశాల క్రికెట్ బోర్డులను అభివృద్ధి చేసే ఛాన్సులు ఉంటాయన్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య యాషెస్ సిరీస్ నిర్వహిస్తున్నప్పటికీ, దాని కంటే, ఎక్కువగానే టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ ల ద్వారా ఆదాయం వస్తోందని పేర్కొన్నారు. అందుకే ఎలాంటి ఐసీసీ ఈవెంట్లు జరిగినా, టీమిండియా, పాక్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. లేకపోతే ఐసీసీ రోడ్డున పడటం గ్యారెంటీ అని హెచ్చరించారు.
2027 వన్డే వరల్డ్ కప్ లోనూ టీమిండియా, పాక్ మ్యాచ్ లు జరుగనున్నాయి. తాజాగా 2027 వన్డే వరల్డ్ కప్ నకు సంబంధించిన గ్రూప్స్ ఫైనల్ చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఇందులోనూ టీమిండియా, పాక్ రెండూ ఒకే గ్రూప్ లో ఉన్నాయి. అంటే గ్రూప్ స్టేజ్ లోనే ఈ రెండు జట్లు తలపడతాయన్నమాట. నాటౌట్ కు చేరితే, కూడా మరో మ్యాచ్ ఉంటుంది. అదృష్టం బాగుంటే, టీమిండియా, పాక్ మధ్య ఫైనల్ జరిగే ఛాన్సులు కూడా లేకపోలేవు. అంటే ఓవరాల్ గా 2027 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా, పాక్ మధ్య మొత్తం మూడు మ్యాచ్ లు జరిగే ఛాన్స్ ఉంది. మూడు మ్యాచ్ లు జరిగితే, ఐసీసీకి కోట్ల వర్షం పక్కా.