Usman Tariq Slams Mohsin Naqvi: పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి (Usman Tariq Slams Mohsin Naqvi) క్రికెట్ స్పెల్లింగే రాదంటూ తీవ్ర ఆగ్రహించారు. నఖ్వీ వల్లే పాకిస్తాన్ క్రికెట్ సర్వనాశనం అయిందని ఫైర్ అయ్యారు. శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మరో రెండు రోజుల్లో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
ఈ తరుణంలోనే ఈ సిరీస్ కోసం జట్టును ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే, ఇందులో మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ కు అవకాశం ఇవ్వలేదు. దీంతో చిర్రెత్తిపోయిన తారిక్, నఖ్వీని టార్గెట్ చేశాడు. క్రికెట్ గురించి తెలియని వాడిని పీసీబీ చైర్మన్ పదవి ఇచ్చారని మండిపడ్డారు. అంతేకాదు, పాకిస్తాన్ జట్టులో ఏం జరిగినా, మౌనంగా చూస్తు ఉండిపోవాల్సిందే అంటూ ఓ కోట్ కూడా సోషల్ మీడియాలో పెట్టాడు. దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక రెండు జట్ల మధ్య మూడు టీ20లతో పాటు 2 టెస్ట్ మ్యాచ్ లు జరగాల్సి ఉంది. అక్టోబర్ 9వ తేదీ అంటే మరో మూడు రోజుల్లోనే పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది. తొలి టీ20 రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా నిర్వహించనుండగా, అక్టోబర్ 11వ తేదీన రెండో మ్యాచ్, అక్టోబర్ 13న మూడో టీ20 నిర్వహించనున్నారు. అన్ని మ్యాచ్ లు కూడా రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా నిర్వహించబోతున్నారు. నవంబర్ 9, నవంబర్ 17 తేదీలలో రెండు టెస్టులు నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. అయితే, ఈ టీ20 సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించగా, తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉస్మాన్ తారిక్ పోస్ట్ పెట్టారు.
పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక (Pak vs SL) రెండు జట్ల మధ్య మూడు టీ20లు జరుగనున్న తరుణంలో సల్మాన్ అలీ అఘాకు ఊహించని షాక్ తగిలింది. అతనిపై వేటు వేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఫర్మాన్ కు బాధ్యతలు అప్పగించింది. అక్కడితో ఆగకుండా, షాహిన్ అఫ్రిది, బాబర్ ఆజంలకు షాకిచ్చింది. ఈ ఇద్దరినీ పరిగణలోకి తీసుకోకుండా, పక్కకు పెట్టింది. ఏషియన్ గేమ్స్ లో రాణించిన హసన్ నవాజ్ కు చోటు దక్కింది.