Women’s T20 World Cup 2026: టి20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ (Women’s T20 World Cup 2026) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంటులో ఇప్పటికే 10 మ్యాచ్లో పూర్తిగా.. ఇవాళ టీమిండియా వర్సెస్ నెదర్లాండ్స్ మహిళల జట్ల (India Women vs Netherlands Women, 10th Match) మధ్య బిగ్ ఫైట్ నిర్వహించారు. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా మహిళల జట్టు, మరో విజయాన్ని నమోదు చేసుకుంది. నెదర్లాండ్స్ జట్టుపైన ఏకంగా 95 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది ఇండియా. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ కు ( Shreyanka Patil ) తీవ్రమైన గాయమైంది. దీంతో మ్యాచ్ మధ్యలోనే ఆమెను స్ట్రెచర్ పై తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది చూసిన క్రికెట్ అభిమానులు… టీమిండియా మహిళల జట్టు దరిద్రం పోయిందంటూ ట్రోల్ చేస్తున్నారు. శ్రేయాంక పాటిల్ గాయంపై (Shreyanka Patil injury ) ఎవరూ కూడా పాజిటివ్ గా రియాక్ట్ కావడం లేదు.
టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా బుధవారం టీమిండియా వర్సెస్ నెదర్లాండ్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచినప్పటికీ.. కీలక పరిణామం చోటు చేసుకుంది. టీమిండియా తరఫున బౌలింగ్ చేసేందుకు దిగిన శ్రేయాంక పాటిల్ ఒకే ఒక్క బంతివేసి గాయం బారిన పడింది. బ్యాటర్ కొట్టిన బంతిని పట్టుకునే క్రమంలో… ఆమె కాలు కాస్త బెనికింది. దీంతో నడవలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మైదానంలో కుప్పకూలింది. దీంతో స్ట్రెక్చర్ పైన ఆమెను డ్రెస్సింగ్ రూమ్ కు తరలించి, అక్కడ నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో ఆమె మళ్లీ స్టేడియం లోకి రాలేదు. దాదాపు ఈ టోర్నమెంట్ నుంచి ఆమె వైదొలిగే చాన్సులు కనిపిస్తున్నాయి.
టీమ్ ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ శ్రేయాంక పాటిల్ ను ఉద్దేశించి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆమెకు గాయం కావడం మంచిదేనని కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఆమెకు గాయం కావడం టీమిండియాకు ఉన్న దరిద్రం పోయినట్లేనని చెబుతున్నారు. అనవసరంగా టీ20 మహిళల ప్రపంచ కప్ టోర్నమెంటులోకి ఆమెను తీసుకున్నారని సీరియస్ అవుతున్నారు. రీల్స్ చేయడానికి తప్ప ఆమె బౌలింగ్ చేయడానికి ఏమాత్రం పనికిరాదని ట్రోల్ చేస్తున్నారు. మొన్న పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఒక్క వికెట్ తీయని, ఈమెను మళ్లీ నెదర్లాండ్స్ తో ఆడించారని ఫైర్ అవుతున్నారు. అదృష్టం కొద్ది ఆమెకు గాయం అయిందని.. పర్మినెంట్ గా ఇండియా ఫ్లైట్ ఎక్కించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
Get well soon, Shreyanka Patil!
[ICC, WomensT20WorldCup] pic.twitter.com/OOrZhTVLG0
— Maitreyanath (@Maitreyanath) June 17, 2026