Naman Dhir : టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య నిన్న టి20 సిరీస్ షురూ అయింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన టీమ్ ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి టి20 సందర్భంగా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నమన్ ధీర్ (Naman Dhir) మూడు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. అంతేకాదు, తన బౌలింగ్ లో సిక్సులు కొడితే.. నెక్స్ట్ బాల్ అవుట్ కావాల్సిందేననే మెసేజ్ పంపాడు. నిన్నటి మ్యాచ్ సందర్భంగా, మనోడు తీసిన మూడు వికెట్లు ఇలాగే పడ్డాయి.
వెస్టిండీస్ తో జరిగిన తొలి మ్యాచ్ లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నమన్ ధీర్ నాలుగు ఓవర్లు సంధించాడు. ఈ క్రమంలో 31 పరుగులు సమర్పించుకొని ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే అతని బౌలింగ్ లో సిక్సర్ కొట్టిన ప్రతి ఆటగాడు నెక్స్ట్ బాల్ ఔట్ అయ్యాడు. 11 ఓవర్ లో మూడవ బంతి నమన్ ధీర్ వేయగా… షై హోప్ సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత నాలుగో బంతికి వికెట్ పడింది.
షై హోప్ క్యాచ్ రూపంలో అవుట్ అయ్యాడు. ఇక 13వ ఓవర్ తొలి బంతికే రోమారియో షెఫర్డ్ సిక్సర్ కొట్టాడు. రెండో బంతికే నమన్ ధీర్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. 15 ఓవర్ నాలుగో బంతిని స్ప్రింగర్ సిక్సర్ బాదగా.. నెక్స్ట్ బాల్ ఔట్ అయ్యాడు. నమన్ ధీర్ బౌలింగ్ లో ఇలా సిక్సర్ కొట్టిన ప్రతి ఒక్కరూ నెక్స్ట్ బాల్ కు ఔట్ అయ్యారు. దీంతో నమన్ ధీర్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టడానికి ప్రత్యర్థులు వణికిపతున్నారు.
టీమిండియాలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన నమన్ ధీర్… అక్షర్ పటేల్ తరహాలో ఒక ఆల్రౌండర్. స్పిన్ బౌలింగ్ వేయడమే కాకుండా భయంకరమైన షాట్స్ ఆడతాడు. దేశవాళి క్రికెట్ లో పంజాబ్ తరఫున బరిలోకి దిగిన ఇతను… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. 1999 సంవత్సరంలో హర్యానాలోని అంబాలా ప్రాంతంలో ఓ మిడిల్ క్లాస్ కుటుంబంలో జన్మించాడు. నమన్ ధీర్ తండ్రి ఓ మెడికల్ షాప్ లో పనిచేసేవాడు. అయితే తన కొడుకు టీమిండియాలోకి వెళ్లాలని కసితో నమన్ ధీర్ తండ్రి ఎంతో కష్టపడ్డాడు. దానికి తగ్గట్టుగానే ఐపిఎల్ లో ఎంట్రీ ఇచ్చిన నమన్… ఇప్పుడు టీమిండియాలోకి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మొన్న వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన నమన్… నిన్న తొలి టి20 ఆడి అదరగొట్టాడు. 5.5 కోట్లకు ముంబై ఇండియన్స్ ఇతడిని కొనుగోలు చేసింది.
🚨 Naman Dhir Debut has something to Remember 🚨
11.3 – Hope smashes SIX
11.4 – Dhir takes his wicket13.1 – Romario smashes SIX
13.2 – Dhir takes his wicket15.4 – Springer smashes SIX
15.5 – Dhir takes his wicket3 Sixes + 3 Wickets = That's some Debut to remember 👏🏻 pic.twitter.com/DihcXtbnOO
— Ajay Jadeja (@AjayJadeja171) October 6, 2026