Shubhman Gill – Sara: 145 సంవత్సరాల తర్వాత వచ్చిన పవిత్రమైన మహా కుంభమేళా జనవరి 13న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభం అయ్యింది. ఈ మహోత్సవం ఫిబ్రవరి 26వ తేదీ శివరాత్రి రోజున ముగుస్తుంది. ప్రయాగ్ రాజ్ సంగమం, ఉజ్జయిని శిప్రా, హరిద్వార్ లోని గంగ, నాసిక్ లోని గోదావరి, అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాలలో పేర్కొన్నారు. అందుకే ఈ నదిలో ఒడ్డున 12 సంవత్సరాలకు ఒకసారి ఈ కుంభమేళాని నిర్వహిస్తారు.
Also Read: Ind Women vs Ire Women: 304 పరుగుల తేడాతో టీమిండియా విజయం… సిరీస్ క్లీన్‌స్వీప్ !
ఈ కుంభమేళాలో పవిత్ర స్నానాన్ని ఆచరించడానికి ప్రపంచ నలుమూలల నుండి కోట్లాది మంది భక్తులు విచ్చేస్తారు. ఈ ఉత్సవాల నిర్వహణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 7,500 కోట్లను మంజూరు చేసింది. దాదాపు 40 కోట్ల మందికి పైగా భక్తులు, సాధువులు ఈ కుంభమేళాకి వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ఈ కుంభమేళకి టీమిండియా క్రికెట్ ఓపెనర్ బ్యాట్స్మెన్ శుబ్ మన్ గిల్, సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ {Shubhman Gill – Sara} హాజరైనట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వీరిద్దరి {Shubhman Gill – Sara} ప్రేమాయణం గురించి ఎప్పటినుంచో సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. గత నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూస్తుంది. కానీ వీరు మాత్రం ఈ రూమర్స్ గురించి ఇప్పటివరకు స్పందించలేదు. అయితే వీరిద్దరూ {Shubhman Gill – Sara} సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో కావడం, ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్స్ చేయడంతో వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ పై వార్తలు వస్తూనే ఉంటాయి. అంతేకాదు గతంలో వీరిద్దరూ పలు రెస్టారెంట్లు, పార్టీలకు వెళ్లినట్లు ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.
ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని గబ్బా టెస్ట్ కి సారా టెండూల్కర్ హాజరు కావడంతో.. గిల్ కోసమే ఆమె ఆస్ట్రేలియాకు వచ్చిందని, మ్యాచ్ లో అతడిని {Shubhman Gill – Sara} సపోర్ట్ చేసేందుకు రంగంలోకి దిగిందని పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా వీరిద్దరూ ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాకి హాజరైనట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: Smriti Mandhana: సెంచరీతో దుమ్ములేపిన స్మృతి.. ఆసియాలోనే తొలి క్రికెటర్‌గా రికార్డు !
కానీ ఈ ఫోటోలు వాస్తవం కాదు. అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సాయంతో రూపొందించిన ఫోటోలుగా నిర్ధారించడం జరిగింది. ఈ {Shubhman Gill – Sara} ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలను చూసిన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ పిచ్చి పనులకు సెలబ్రిటీలను వాడుకోవడం అన్యాయమని.. ఇకనుండైనా ఇలాంటి పనులు మానుకోవాలని సూచిస్తున్నారు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనంతరం గిల్ తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా తన కుటుంబంతో కలిసి కొత్త విలాసవంతమైన ఇంట్లో లోహ్రీ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.